LPG cylinder users: మనలో చాలామంది గ్యాస్ సిలిండర్ ను వినియోగిస్తారనే సంగతి తెలిసిందే. గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకోవడానికి ఎన్నో ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. దేశంలోని ప్రజలలో ఎక్కువమంది ఇండేన్ గ్యాస్, భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్ సిలిండర్లను వాడుతున్నారు. ఈ సిలిండర్లలో ఏ సిలిండర్ ను వినియోగిస్తున్నా కస్టమర్ కేర్ నంబర్ కు రిజిష్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి కాల్ చేయడం ద్వారా సులువుగా గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకోవచ్చు.
వాట్సాప్ సహాయంతో కూడా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. మిస్డ్ కాల్ ద్వారా కూడా గ్యాస్ సిలిండర్ బుకింగ్ జరుగుతుంది. గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకోవడానికి పేటీఎం, గూగుల్ పే, ఇతర యాప్స్ సైతం ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఐపీపీబీ మొబైల్ బ్యాంకింగ్ యాప్ సహాయంతో కూడా ఎల్పీజీ సిలిండర్ ను బుకింగ్ చేసుకునే ఛాన్స్ ఉంది.
Also Read: ఆధార్ కార్డుపై ఫోటో నచ్చలేదా.. ఏ విధంగా మార్చుకోవాలంటే?
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ తాజాగా గ్యాస్ సిలిండర్ కు సంబంధించి ఈ విషయాన్ని వెల్లడించడం గమనార్హం. ఇందుకోసం మొదట ఐపీపీఐ మొబైల్ బ్యాంకింగ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో లాగిన్ అయ్యి పే బిల్స్ పై క్లిక్ చేసి ఆ తర్వాత ఎల్‌పీజీ సిలిండర్ ఆప్షన్ ను ఎంచుకోవడం ద్వారా గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.
ఆ తర్వాత బిల్లర్ ను ఎంచుకుని ఎల్‌పీజీ ఐడీ/డిస్ట్రిబ్యూటర్/కన్సూమర్ ఐడీలను ఎంటర్ చేసి వాటితో పాటు రిజిస్టర్ మొబైల్ నంబర్ ను కూడా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత డబ్బులు కట్టి వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేసి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసుకున్న వాళ్లకు మెసేజ్ వస్తుంది.
Also Read: గోరువెచ్చటి నీటిలో ఇంగువ కలిపి తాగితే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే?