10 నిమిషాల్లో పాన్ కార్డు పొందే ఛాన్స్.. ఫోన్ నుంచే అప్లై ..?

కొత్తగా పాన్ కార్డు తీసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే ఇంటి నుంచే సులభంగా పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకుని పాన్ కార్డును పొందవచ్చు. గతంలో పాన్ కార్డు కావాలంటే దరఖాస్తు చేసినప్పటి నుంచి 15 రోజుల వరకు వేచి ఉండాల్సి వచ్చేది. అయితే ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖ ఇంటి నుంచే పాన్ కార్డును పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌ ద్వారా ఈపాన్ కార్డును పొందవచ్చు. ఇన్‌స్టంట్ పాన్ అనే ఆప్షన్ సహాయంతో […]

Written By: Navya, Updated On : April 23, 2021 3:18 pm
Follow us on

కొత్తగా పాన్ కార్డు తీసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే ఇంటి నుంచే సులభంగా పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకుని పాన్ కార్డును పొందవచ్చు. గతంలో పాన్ కార్డు కావాలంటే దరఖాస్తు చేసినప్పటి నుంచి 15 రోజుల వరకు వేచి ఉండాల్సి వచ్చేది. అయితే ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖ ఇంటి నుంచే పాన్ కార్డును పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌ ద్వారా ఈపాన్ కార్డును పొందవచ్చు.

ఇన్‌స్టంట్ పాన్ అనే ఆప్షన్ సహాయంతో ఈ పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మొదట ఆధార్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసి ఆ తరువాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ‌కు వచ్చే వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్, రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్‌కు వచ్చే లింక్ సహాయంతో ఈపాన్ కార్డును సులభంగా డౌన్ లోడ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. కొత్త నిబంధనల వల్ల సులువుగా పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇప్పటికే పాన్ కార్డును కలిగి ఉన్నవాళ్లు పాన్ కార్డుకు ఆధార్ నంబర్ ను లింక్ చేసుకుంటే మాత్రమే పాన్ కార్డ్ చెల్లుతుంది. ఇప్పటివరకు లింక్ చేయనివారు జూన్ నెల 30వ తేదీలోగా ఆధార్ కార్డ్ తో పాన్ కార్డును లింక్ చేసుకోవాలి. ఆధార్ కార్డ్ తో పాన్ కార్డును లింక్ చేసుకోకపోతే మాత్రం జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. పాన్ కార్డ్ ఉంటే మాత్రమే ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడం సాధ్యమవుతుంది.

అధిక విలువ గల నగదు లావాదేవీలను చేయాలన్నా పాన్ కార్డ్ తప్పనిసరిగా ఉండాల్సిందే. నగదు లావాదేవీలు ఎక్కువగా జరిపే వాళ్లు పాన్ కార్డును కలిగి ఉంటే మంచిది.