Health insurance: మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? ఈ హెల్త్ ఇన్సురెన్స్ చేయించుకోవడం తెలుసు కానీ ఎలా ఉపయోగించాలో? తర్వాత ఎక్కడ, ఎలా ఉపయోగించాలో కూడా చాలా మందికి అర్థం కాదు. మీరు ఇక ఈ విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ముందుగానే క్లారిటీగా అన్నీ తెలుసుకొని అడుగు వేయండి. అయితే గతంలో మాదిరి ఎక్కువ రోజులు ఇప్పుడు ఆస్పిటల్ లో ఇన్సురెన్స్ క్లెయిమ్ కోసం సమయం వెచ్చించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందులో చిన్న మార్పులు చేశారు. అవేంటంటే?
గతంలో హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలంటే కచ్చితంగా 24 గంటలు ఆస్పత్రిలోనే ఉండాల్సి వచ్చేది కదా. అయితే ఇప్పుడు పరిస్థితి కాస్త మారింది. ఇన్సూరెన్స్ ఉన్న వాళ్లకు గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఈ వచ్చిన కొత్త రూల్ తో పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మంచి అవకాశం ఇది. అయితే చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు కేవలం రెండు గంటల హాస్పిటలైజేషన్ అవసరమైన ట్రీట్‌మెంట్లను కూడా కవర్ చేస్తున్న విషయం తెలిసిందే. మెడికల్ టెక్నాలజీ, ట్రీట్‌మెంట్ విధానాలు అడ్వాన్స్ అయ్యాయి. అందుకే ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లలో కూడా మార్పులు వచ్చాయి.
Also Read : జూనియర్ ట్రైలర్ అంత ఒకే కానీ ఆ ఒక్కటే పెద్ద మైనస్ గా మారిందా..?
గత పది సంవత్సరాలలో హెల్త్‌కేర్ సెక్టార్ బాగా డెవలప్ అవుతుంది. ట్రీట్‌మెంట్లు, సర్జరీలు జరిగే విధానాల్లో కూడా పూర్తిగా ఛేంజ్ కనిపిస్తుంది. దీంతో రోగులు హాస్పిటల్‌లో ఎక్కువ సమయం ఉండాల్సిన అవసరం కూడా ఇప్పుడు లేదనే చెప్పాలి. ఈ విషయాన్ని స్వయంగాని పాలసీబజార్ హెల్త్ ఇన్సూరెన్స్ హెడ్ సిద్ధార్థ్ సింఘాల్ తెలిపారు. అంటే ఇప్పుడు ట్రీట్ మెంట్లు, ఇన్సూరెన్స్ ల కోసం ఎక్కువ సేపు ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం లేదన్నమాట. గతంలో కంటిశుక్లం తొలగింపు, కీమోథెరపీ, యాంజియోగ్రఫీ వంటి సర్జరీలు లేదా ప్రొసీజర్‌లకు రాత్రి మొత్తం కూడా ఆస్పత్రిలోనే ఉండాల్సి వచ్చేది.
కానీ ఇప్పుడు పరిస్థితి మారి మినిమల్లీ ఇన్వేసివ్ టెక్నిక్స్, మెరుగైన డయాగ్నోస్టిక్స్ అనే పద్దతుల ద్వారా కొన్ని గంటల్లోనే ఈ చికిత్స పూర్తి అవుతుంది. చికిత్స కూడా త్వరగానే అవుతుంది కాబట్టి చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు తమ పాలసీలను మార్చాయి. ఇందులో భాగంగానే షార్ట్-టర్మ్ హాస్పిటలైజేషన్ కవరేజ్‌ను అందిస్తున్నాయి. దీనివల్ల పాలసీదారులు 24 గంటల పాటు హాస్పిటల్‌లో ఉండాల్సిన అవసరం లేకుండానే క్లెయిమ్‌లు చేసుకోవచ్చు. వారి క్లెయిమ్ ముందులా రిజక్ట్ కాదు అన్నమాట. ఈ షార్ట్-టర్మ్ హాస్పిటల్ స్టే కవరేజ్‌కు ప్రత్యేకంగా ఎలాంటి ఎక్స్ ట్రా మినహాయింపులు ఉండవు.
Also Read: నాని ‘ది ప్యారడైజ్’ నుండి మోహన్ బాబు లుక్ లీక్..ఈ రేంజ్ లో ఉన్నాడేంటి బాబోయ్!
ఈ ఫీచర్లను అందించే కొన్ని ప్లాన్‌లలో నివా బూపా హెల్త్ రీఅష్యూర్, కేర్ సుప్రీం ప్లాన్, ఐసీఐసీఐ లొంబార్డ్ ఎలివేట్ ప్లాన్ వంటి ప్లాన్ లు ఉన్నాయి. 30 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత పొగతాగని, మెట్రో సిటీల్లో నివసించే పురుషుడికి రూ.10 లక్షల సమ్ ఇన్సూర్డ్ కోసం ఐసీఐసీఐ లొంబార్డ్ ఎలివేట్ పాలసీ కింద ఏడాదికి కనీసం రూ.9,195 ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. కేర్ సుప్రీం పాలసీ కింద రూ.12,790 డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత మీరు గనుక నివా బూపా హెల్త్ రీఅష్యూర్ చేసుకుంటే ఇందుకోసం రూ.14,199 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.