https://oktelugu.com/

ఆనందయ్య మందు పంపిణీ ఎప్పుడో?

ఆనందయ్య మందు పంపిణీపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కృష్ణపట్నం పోర్టులోని సీవీఆర్ కాంప్లెక్స్ లో మందు తయారీ జరుగుతుండగా దీనిపై ప్రభుత్వానికి, ఆనందయ్యకు పొసగడం లేదని తెలుస్తోంది. దీంతో ఆనందయ్య మందు పంపిణీ లేదని, రోగులెవరు సోమవారం రావొద్దంటూ చెబుతున్నారు. ఆనందయ్య మందు తయారీకి ప్రభుత్వం సహకరించడం లేదని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. రోజుకు కేవలం 4 వేల మందికి తాము మందు పంపిణీ చేస్తామని చెబుతున్నారు. ప్రజలకు మందు చేయాలంటే రూ.లక్షలు ఖర్చవుతాయని చెప్పారు. ప్రభుత్వ […]

Written By:
  • Srinivas
  • , Updated On : June 6, 2021 / 09:19 AM IST
    Follow us on

    ఆనందయ్య మందు పంపిణీపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కృష్ణపట్నం పోర్టులోని సీవీఆర్ కాంప్లెక్స్ లో మందు తయారీ జరుగుతుండగా దీనిపై ప్రభుత్వానికి, ఆనందయ్యకు పొసగడం లేదని తెలుస్తోంది. దీంతో ఆనందయ్య మందు పంపిణీ లేదని, రోగులెవరు సోమవారం రావొద్దంటూ చెబుతున్నారు. ఆనందయ్య మందు తయారీకి ప్రభుత్వం సహకరించడం లేదని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు.

    రోజుకు కేవలం 4 వేల మందికి తాము మందు పంపిణీ చేస్తామని చెబుతున్నారు. ప్రజలకు మందు చేయాలంటే రూ.లక్షలు ఖర్చవుతాయని చెప్పారు. ప్రభుత్వ సహకారం లేనిదే ఇదిసాధ్యం కాదని ఆనందయ్య అనుచరుడు సంపత్ రాజ్ ప్రకటించారు. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి ఆధ్వర్యంలో రహస్యంగా మందు తయారు చేసినట్లు ప్రచారం సాగుతోంది. మిగతా జనాలకు మందు తయారీ చేయాలంటే ప్రభుత్వ సహకారం కావాలని అనుచరులు కోరుతున్నారు.

    ఆనందయ్య మందు రాష్ర్టమంతా ఆన్ లైన్ లో పంపిణీ చేస్తామని ఓ వైపు ప్రభుత్వం చెబుతుండగా ఆయన అనుచరులు మాత్రం అలాంటిదేమీ లేదని పేర్కొంటున్నారు. ఆన్ లైన్ లో ఆనందయ్య మందు పంపిణీ అనేది తప్పుడు సమాచారం అని తెలిపారు. ఆనందయ్య స్వయంగా ప్రకటించే వరకు మందు తయారీపై కూడా ఎలాంటి నిర్ణయాలు ఉండబోవని చెబుతున్నారు. దీంతో ముందుగా చెప్పినట్లు సోమవారం నుంచి ఆనందయ్య మందు అందుబాటులోకి వస్తుందా లేదా అన్నదానిపై అందరిలో ఉత్కంఠ నెలకొంది.

    ఆనందయ్య మందు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. కోవిడ్ బారినుంచి రక్షించుకోవాలంటే మందు ఒక్కటే శరణ్యమని భావిస్తున్నారు. దీంతో ఆనందయ్య మందు కోసం జనం బారులు తీరుతున్నారు. వైరస్ నుంచి రక్షణ పొందేందుకు వీలుగా మందు తీసుకోవాలని ఆశగా ఉన్నారు. కరోనా బాధితుల ఆశలు తేర్చేందుకు మందు పంపిణీ జరగాలని ఆకాంక్షిస్తున్నారు.