
సామాన్యుల నుంచి ధనవంతుల వరకు ప్రతి ఒక్కరు తక్కువ సమయంలోనే ఎక్కువ ఆదాయం సంపాదించాలని భావిస్తూ ఉంటారు. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా భారీ మొత్తంలో లాభాలను పొందవచ్చు. అయితే కొన్నిసార్లు స్టాక్ మార్కెట్ లో నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఇండియన్ ఐటీ స్టాక్ సుబెక్స్ షేరు సంవత్సర కాలంలోనే ఇన్వెస్ట్ చేసిన వాళ్లను ఊహించని స్థాయిలో ధనవంతులను చేస్తోంది.
ఎవరైతే సుబెక్స్ షేర్లను కలిగి ఉన్నారో వారు లక్షాధికారులు అయ్యారు. తక్కువ పెట్టుబడితో లక్షాధికారులు కావాలని భావించే వాళ్లకు స్టాక్ మార్కెట్ ఉత్తమమని చెప్పవచ్చు. అయితే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చెయ్యడం ద్వారా లాభాలను పొందే అవకాశంతో పాటు రిస్క్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. సుబెక్స్ సంస్థ ప్రముఖ నగరాల్లో ఒకటైన బెంగళూరు నగరం నుంచి కార్యకలాపాలను నిర్వహిస్తోంది.
సుబెక్స్ సంస్థ సాఫ్ట్ వేర్ కంపెనీ కాగా 2020 సంవత్సరం జులై నెల 9వ తేదీన ఈ కంపెనీ షేరు ధర కేవలం రూ.7.82గా ఉంది. అయితే ఏడాది కాలంలోనే ఈ కంపెనీ షేరు ధర 837 శాతం పైకి కదలడం గమనార్హం. మల్టీ బ్యాగర్ స్టాక్స్‌లో సుబెక్స్ షేరు కూడా ఒకటి కాగా ఈ కంపెనీ షేరు ఏడాది కాలంలో ఏకంగా 150 శాతం రాబడిని అందించడం గమనార్హం. ఈ కంపెనీ షేరు ధర 30 రోజుల్లో ఏకంగా 22.8 శాతం పరుగులు పెట్టడం గమనార్హం.
సంవత్సరం క్రితం ఈ షేర్ లో పెట్టుబడి పెట్టిన వాళ్లకు ఇప్పుడు ఏకంగా రూ.8.37 లక్షలు లభిస్తాయి. ఒక విధంగా చెప్పాలంటే ఈ లాభం కళ్లు చెదిరే లాభం అని చెప్పాలి. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్లకు సుబెక్స్ షేర్లలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ప్రయోజనం చేకూరుతుంది.