https://oktelugu.com/

Green Deposit In Bank : గ్రీన్ డిపాజిట్లు అంటే ఏమిటి? వీటిపై ఎంత వడ్డీ వస్తుంది?

గ్రీన్ డిపాజిట్ ద్వారా వినియోగదారులు ప్రత్యేకంగా ఫిక్స్డ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మిగతా డిపాజిట్ల కంటే గ్రీన్ డిపాజిట్ ద్వారా ఎక్కువగా వడ్డీని పొందవచ్చు.

Written By:
  • Srinivas
  • , Updated On : February 3, 2024 4:03 pm
    green fixed deposit

    green fixed deposit

    Follow us on

    Green Deposit In Bank :ఒకప్పుడు బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేయడం మాత్రమే తెలుసు.. ఆ తరువాత కాస్త వడ్డీ కోసం ఫిక్స్డ్ డిపాజిట్ వచ్చాయి. కానీ ఈమధ్య ఎక్కువగా వినిపిస్తున్న పేరు గ్రీన్ డిపాజిట్. గ్రీన్ డిపాజిట్ అంటే ఏమిటి అని చాలామందికి సందేహం ఉంది. వినియోగదారులను ఆకర్షించడానికి బ్యాంకులు కొత్త కొత్త స్కీమ్ లు తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగా గ్రీన్ డిపాజిట్ ను అందుబాటులోకి తెచ్చుకుంది. గ్రీన్ డిపాజిట్ ద్వారా వినియోగదారులు ప్రత్యేకంగా ఫిక్స్డ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మిగతా డిపాజిట్ల కంటే గ్రీన్ డిపాజిట్ ద్వారా ఎక్కువగా వడ్డీని పొందవచ్చు. ఈ నేపథ్యంలో అసలు గ్రీన్ డిపాజిట్ అంటే ఏమిటి? ఈ డబ్బుతో బ్యాంకులో ఏం చేస్తాయి? ఆ వివరాల్లోకి వెళితే….

    ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం అనేక సంస్థలు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. వీటిలో బ్యాంకులు కూడా పర్యావరణ పరిరక్షణకు మద్దతుగా నిలుస్తున్నాయి. ఇందులో భాగంగా బ్యాంకులు పర్యావరణ పరిరక్షణకు సంబంధం ఉన్న ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ పెట్టుబడులను వినియోగదారుల నుంచి సేకరిస్తాయి. ఇలా సేకరించిన డిపాజిట్లను గ్రీన్ డిపాజిట్లఅంటారు.

    గ్రీన్ డిపాజిట్ల ను సేకరించి వాటికి బ్యాంకులలు వడ్డీని కూడా చెల్లిస్తాయి. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గ్రీన్ డిపాజిట్లను సేకరిస్తున్నారు. ఇందులో డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 1111రోజులకు 5.70 వడ్డీని చెల్లిస్తారు. అలాగే 2222 రోజులకు 5.85 వడ్డీని చెల్లిస్తారు. ఆసక్తి ఉన్న వినియోగదారులు రూ. 50 వేల నుంచి 2కోట్ల వరకు డిపాజిట్లు చేయొచ్చు. సాధారణ డిపాజిట్ల కంటే ఇందులో 0.20 వడ్డీ అదనంగా వస్తుంది.

    కొన్ని స్మాల్ ఫైనాన్స్ ఆర్గనైజేషన్ కూడా ఈ డిపాజిట్లను సేకరిస్తున్నాయి. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు గ్రీన్ డిపాజిట్లు సేకరిస్తుంది వీటిపై 12 నెలలకు 6.75 వడ్డీ, 12 నుంచి 15 నెలలకు 7.75 వడ్డీ అందిస్తోంది అలాగే గరిష్టంగా 18 నెలలకు ఎన్ని శాతం వడ్డీని ఇస్తుంది. ఇలా సేకరించిన పెట్టుబడులను ఎలక్ట్రిక్ వెహికల్, సోలా ర్, ప్లాస్టిక్ రీసైక్లింగ్ వంటి ప్రాజెక్టులో పెట్టుబడులు పెడతారు .