Homeబిజినెస్Google Pixel 9a : సెల్ఫీ కెమెరా.. వీడియో కాలింగ్ కోసం బెస్ట్ ఫోన్.. అంతేకాక...

Google Pixel 9a : సెల్ఫీ కెమెరా.. వీడియో కాలింగ్ కోసం బెస్ట్ ఫోన్.. అంతేకాక రూ.11,000 డిస్కౌంట్.. దీని గురించి తెలిస్తే వెంటనే కొంటారు..

Google Pixel 9a : నేటి కాలంలో మొబైల్ ఉన్నవారు సెల్ఫీ కెమెరా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అర్జెంటుగా ఫోటో కావాలని అనుకున్న వారు.. సోషల్ మీడియాలో కంటెంట్ సృష్టించే వారికి వీడియోలను సెల్ఫీ ద్వారానే ఎక్కువగా రికార్డ్ చేస్తున్నారు. అయితే నాణ్యమైన కెమెరా లేదా ఎక్కువ మెగా పిక్సెల్ ఉంటేనే ఫోటోలు లేదా వీడియో క్వాలిటీగా వస్తుంది. ఇలాంటి వాటికోసం Google Pixel అద్భుతమైన ఓ మొబైల్ ను అందిస్తోంది. అయితే ఈ మొబైల్ ఫీచర్స్ విషయంలోనే కాకుండా ధరపై కూడా డిస్కౌంట్లో పొందవచ్చు. ఏకంగా రూ.11,000 తగ్గింపుతో వచ్చే ఈ ఫోన్ గురించి పూర్తి వివరాలు లోకి వెళ్తే..

Google Pixel 9a మొబైల్ ఇప్పటికే మార్కెట్లో అలరిస్తోంది. ఇందులో ఉండే ఫీచర్స్ వినియోగదారులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఈ మొబైల్ లో 6.3 అంగుళాల AMOLED డిస్ ప్లే అమర్చారు. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. 2700 nits బ్రైట్నెస్ ఉండే ఇందులో స్పష్టమైన విజువల్స్ చూడవచ్చు. Netflix వంటి మూవీస్ ఇందులో చూడటం వల్ల అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. అలాగే గేమింగ్ కోరుకునే వారికి కూడా ఈ డిస్ప్లే బాగా ఉపయోగపడుతుంది. ఈ మొబైల్ లో కెమెరా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.48 MP మెయిన్ కెమెరా ఉండడంతో క్వాలిటీ స్నాప్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే 13 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్ తో కూడా ఫోటోలు తీసుకోవచ్చు. అయితే సెల్ఫీ కోసం ఇందులో 13 MP కెమెరాను అమర్చారు. ఇది క్వాలిటీ ఫోటోలతో పాటు నాణ్యమైన వీడియోలను రికార్డింగ్ చేస్తుంది.

ఈ మొబైల్ లో బ్యాటరీ కూడా బలంగానే ఉందని తెలుస్తోంది. ఇందులో 5100 mAh బ్యాటరీని అమర్చారు. దీర్ఘకాలికంగా మొబైల్ వాడే వారికి ఈ బ్యాటరీ సపోర్టుగా ఉంటుంది. అలాగే ఈ బ్యాటరీ ఫాస్టెస్ట్ చార్జింగ్ కు సపోర్ట్ చేయడంతో తొందరగా చార్జింగ్ కావాలనే అనుకునే వారికి యూస్ ఫుల్ గా ఉంటుంది. అలాగే ఇందులో గూగుల్ టెన్సర్ G4 చిప్సెట్ ను అమర్చారు. దీంతో మొబైల్ వేగంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్న ఈ మొబైల్ ప్రస్తుతం మార్కెట్లో రూ.38,940 ధరతో విక్రయిస్తున్నారు. అయితే దీనిపై ప్లాట్ డిస్కౌంట్ రూ.11,000 ప్రకటించారు. అలాగే ఫెడరల్ బ్యాంకు తోపాటు బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డులు ఉంటే అదనంగా రూ.1,500 వరకు తగ్గింపు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ మొబైల్ ను రూ.37,440 కే వస్తుంది. అమెజాన్ ఈ కామర్స్ సంస్థలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. అద్భుతమైన ఫీచర్లు ఉన్న ఈ మొబైల్ పై డిస్కౌంట్ పొందాలంటే ఇక్కడ కొనుగోలు చేయవచ్చు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version