Ayodhya Ram Mandir: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి వ్యతిరేకంగా గతంలో లౌకికవాదులు, మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేసేవి. ‘గుడికి డబ్బులు వృథా, బడులు–ఆసుపత్రులు కట్టాలి’ అని ప్రచారం చేశాయి. కానీ, మోదీ రామ మందిర సమస్యకు పరిష్కారం చూపడంతోపాటు ఆలయం వృథా అన్న నోళ్లతోనే ఇప్పుడు శెభాష అనిపిస్తున్నారు. 2024 జనవరిలో ఆలయం పునఃప్రారంభించిన తర్వాత అయోధ్య ఆర్థిక పరిస్థితి మొత్తం మారిపోయింది. ఐఐఎం లక్నో ’ఎకనామిక్ రెనాసెన్స్ ఆఫ్ అయోధ్య’ కేస్ స్టడీ రామ్ మందిర్ ప్రాంతీయ అభివృద్ధిని స్పష్టంగా ధ్రువీకరించింది.
భారీగా పర్యాటకుల రాక..
రామ మందిరం నిర్మానానికి ముందు అయోధ్యకు ఏటా 1.7 లక్షల మంది సందర్శకులు వచ్చేవారు. 2024 మొదటి ఆరు నెలల్లోనే 11 కోట్ల మంది అయోద్యను సందర్శించారు. 2025 కుంభమేళాతో రికార్డు స్థాయిలు. 2025–26కు టూరిజం ఆదాయం రూ.10,000 కోట్లకు చేరనుంది. చుట్టుపక్కల తీర్థక్షేత్రాల సందర్శనలు కూడా పెరిగాయి.
వ్యాపారాల వృద్ధి…
చిన్నచిన్న దుకాణాదారులకు ఇదివరకు రోజుకు రూ.500 ఆదాయం రాగా, ఇప్పుడు రూ.2,500 వస్తోంది. ఇక రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే.. అమాంతం పెరిగింది. అయోధ్య పట్టణం నుంచి కేంద్రానికి రూ.400 కోట్ల జీఎస్టీ వస్తోంది. టూరిజం పరంగా చూస్తే 2025–26 కు సంబంధించిన అంచనా ప్రకారం.. రూ.10 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. హోటల్ రూంల విషయానికి వస్తే 2024 వరకు 2 వేల హోటళ్లు ఉండగా, ఇప్పుడు 5 వేలకు పెరిగాయి. రెస్టారెంట్లు గతంలో 200 ఉండగా, ఇప్పుడు 2 వేలకు పెరిగాయి. పేదవాడికి సంబంధించిన రిక్షాల సంఖ్య గతంలో 500లు ఉండగా, ఇప్పుడు 17 వేలకు పెరిగింది, వస్త్ర దుకాణాలు గతంలో 150 ఉండగా ఇప్పుడు 500 లకు పెరిగాయి. హోం స్టేలు, ఇళ్లలో పేయింగ్ గెస్ట్‌గా ఉండే హోం స్టేల సంఖ్య 1136కు పెరిగింది. గతంలో ఒక్కటి కూడా ఉండేది కాదు.
’గుడి వృథా’ వాదనలు తప్పుగా ఉన్నాయి. మందిరం టూరిజం ద్వారా బడులు, ఆసుపత్రుల నిధులు సొంతంగా వస్తున్నాయి. స్థానికుల ఆదాయం 5 రెట్లు పెరిగింది. ఇది సాంస్కృతిక విశ్వాసాలు ఆర్థిక ప్రగతికి దారి తీస్తాయని నిరూపిస్తోంది.