New Google Pixel series: మార్కెట్లో కొత్త ఫోన్లు సందడి చేయనున్నాయి. అన్ని వర్గాల వారిని ఆకర్షించేందుకు వివిధ వేరియంట్ల మోడల్స్ మార్కెట్లోకి రాబోతున్నాయి. వీటిలో Google Pixel 11, Pixel 11 Pro, Pro XL తో పాటు Pixel Fold ఉన్నాయి. ఈ ఫోన్ల విడుదలపై అధికారికంగా ప్రకటన చేయకపోయినప్పటికీ.. కొన్ని లీక్స్ ప్రకారం ఇవి ఆగస్టు 2026లో విడుదలవుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్లు Tensor G6 చిప్‌తో రానున్నాయి. ఇది CPUలో మెరుగైన పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. కానీ GPUలో కొంత వెనుకబాటుగా ఉండవచ్చు. అయితే లీక్స్ ప్రకారం.. ఈ ఫోన్లు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం..
Pixel 11:
Google Pixel 11 సాధారణ మోడల్‌గా 6.3-ఇంచ్ OLED డిస్ప్లే (120Hz, 2200 nits)తో ఉండనుంది. ఇందులో 8 నుంచి 12GB RAM సపోర్టు చేయనుంది. 50MP మెయిన్ కెమెరా, 4840mAh బ్యాటరీతో పనిచయనుంది. Tensor G6 చిప్ CPU సింగిల్-కోర్ తో గతంలో ఉన్న ఫోన్ కంటే వేగవంతంగా పనిచేస్తుంది. అయితే గ్రాఫిక్స్ గేమింగ్‌లో స్నాప్డ్రాగన్లతో పోటీ పడకపోవచ్చు. భారత్‌లో ఈ ఫోన్ రూ. 79,990 నుంచి రూ.84,999 ఉండొచ్చంటున్నారు.
Pixel 11 Pro & Pro XL:
Pixel 11 Pro 6.3(1280×2856, 2450 nits) అంగుళాలతో పనిచేయనుంది. Pro XL 6.8-ఇంచ్ డిస్ప్లే ఉండనుంది. ఇది 12/16GB RAM, 50MP+48/50MP ట్రిపుల్ కెమెరాలు ఉండనున్నాయి. 4707 లేదా 5000mAh బ్యాటరీ ఉండే అవకాశం. Tensor G6తో మల్టీ-టాస్కింగ్, కెమెరా AI ఫీచర్లు ఉంటాయి. CPU మెరుగులతో ఎఫిషియెన్సీ బెటర్ కానీ GPU పాత డిజైన్ వల్ల హై-ఎండ్ గేమింగ్‌లో వెనుకబడవచ్చు. ఇది భారత్ లో రిలీజ్ అయితే రూ.1,03,999 నుంచి రూ.1,19,999-₹1,36,999 వరకు ఉండొచ్చు.
Pixel Fold (Pro Fold):
ఫోల్డింగ్ ఫోన్ కోసం ఎదురుచూసేవారికి Pixel 11 Pro Fold ఫోల్డబుల్ ఆకర్షించనుంది. 2076×2160 ఇన్నర్ ఫోల్డింగ్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఇది 120Hz, 2050 nits బ్రైట్నెస్ ను అందిస్తుంది. కవర్ డిస్ప్లే 1080×2342 గా ఉండనుంది. ఈ మొబైల్ 12 నుంచి 16GB RAM సపోర్ట్, 48MP+10.5MP+10.8MP కెమెరాలు ఉండనున్నాయి. 4658mAh బ్యాటరీ ఉండి.. 30W వైర్డ్ చార్జింగ్‌తో పనిచేస్తుంది. Tensor G6తో ఫోల్డబుల్ ఎఫిషియెన్సీ మెరుగ్గా, మల్టీటాస్కింగ్ సూపర్, కానీ బ్యాటరీ ఆంక్షైటీ తగ్గించవచ్చు. దీని ధర రూ.1,50,000 ఉండే అవకాశం ఉంది.