Homeబిజినెస్Google Pixel 10 Pro Fold Discount: ఈ ఫోల్డింగ్ ఫోన్ పై ఏకంగా రూ.39...

Google Pixel 10 Pro Fold Discount: ఈ ఫోల్డింగ్ ఫోన్ పై ఏకంగా రూ.39 వేల డిస్కౌంట్.. వెంటనే త్వరపడండి..

Google Pixel 10 Pro Fold Discount: కాలం మారుతున్న కొత్త స్మార్ట్ ఫోన్ వినియోగంలో కూడా అప్డేట్ కోరుకుంటున్నారు. ఒకప్పడు ప్లాట్ గా ఉండే ఫోన్లపై ఆసక్తిచూపిన వారు ఇప్పుడు ఫోల్డబుల్ మొబైల్స్ పై ఆసక్తి పెంచుకుంటున్నారు. కంపెనీలుసైతం వినియోగదారుల ఆసక్తిని దృష్టిలోఉంచుకొని మార్కెట్లోకి కొత్త డివైజ్ లను తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ ను విక్రయిస్తోంది. అయితే దీనిపై కంపెనీ సరికొత్త ఆఫర్ ను ప్రకటించింది. ప్రస్తుతం ఈ ఫోన్ కొనుగోలు చేసిన వారికి రూ. 39,289 వరకు భారీ డిస్కౌంట్ లభించనుంది. ఆ వివరాల్లోకి వెళితె..

డిజైన్ పరంగా చూస్తే.. గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ అత్యంత స్లిమ్‌గా, ప్రీమియం లుక్‌తో ఉంటుంది. ఇందులో ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్, గేర్‌లెస్ హింజ్ (మడత పెట్టే కీలు) ఉపయోగించారు. దీనిని పూర్తిగా విప్పినప్పుడు 8 అంగుళాల OLED డిస్ ప్లేను చూడొచ్చు. ఒక రకంగా చిన్నపాటి టాబ్లెట్ లాంటి అనుభూతిని ఇస్తుంది. ఫోల్డ్ చేసినప్పుడు 6.4అంగుళాల కవర్ డిస్‌ప్లే ఉంటుంది. రెండు డిస్ ప్లేలు 120Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తూ 3000 nits పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటాయి. దీంతో ఎలాంటి వాతావరణంలోనైనా అద్భుతమైన డిస్ ప్లేను అందిస్తాయి.

గూగుల్ తన స్వంత తయారీ అయిన నెక్స్ట్ జనరేషన్ Tensor G5 ప్రాసెసర్‌ను ఇందులో మొదటిసారిగా ప్రవేశపెట్టింది. దీనికి తోడు భారీ 16GB RAM, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్‌ ఉండడంతో మల్టీటాస్కింగ్, హెవీ గేమింగ్ వారికి గూగుల్ జెమిని ఏఐ ఫీచర్లు అత్యంత వేగంగా, స్మూత్‌గా రన్ అవుతాయి. సాఫ్ట్‌వేర్ పరంగా ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.

ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48MP ప్రధాన కెమెరా, 10.5MP అల్ట్రా-వైడ్ కెమెరా, 10MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. వీటితో పాటు ఇన్-డిస్‌ప్లే మరియు కవర్ స్క్రీన్‌లపై 10MP సెల్ఫీ కెమెరాలను ఇచ్చారు. గూగుల్ యొక్క ఏఐ ఫోటో టూల్స్ సహాయంతో ప్రొఫెషనల్ స్థాయి ఫోటోలు, 4K వీడియోలను క్యాప్చర్ చేయవచ్చు. పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ భారీ 5,015 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది సాధారణ వినియోగంలో 24 గంటలకు పైగా బ్యాకప్ ఇస్తుంది. అలాగే భద్రత కోసం గూగుల్ టైటాన్ M2 సెక్యూరిటీ చిప్‌ను అమర్చారు.

భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ అసలు ధర రూ.1,72,999 గా ఉంది. అయితే ప్రస్తుతం నడుస్తున్న లాంచ్ ఆఫర్లలో భాగంగా, మీ పాత ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడంతో పాటు ప్రముఖ బ్యాంక్ (HDFC వంటి) క్రెడిట్ కార్డ్‌లపై లభించే ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఆఫర్లను కలుపుకుంటే వినియోగదారులు మొత్తంగా రూ. 39,289 వరకు ఆదా చేసుకోవచ్చు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular