iPhone 16 big discount: మార్కెట్లోకి ఎన్నో రకాల మొబైల్స్ వస్తున్నప్పటికీ ఖరీదైన వాటిని కొనుగోలు చేయాలని కొందరు అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా Apple కంపెనీకి చెందిన iphone కోసం ఎగబడుతూ ఉంటారు. వినియోగదారుల డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని కూడా కంపెనీ రకరకాల మొబైల్స్ ను మార్కెట్ లోకి తీసుకువస్తూ ఉంటుంది. అయితే ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన iPhone 16 ధర ఆదరణ పొందుతున్నప్పటికీ వినియోగదారుల సౌలభ్యం కోసం ఇటీవల దీని ధర తగ్గించారు. దీంతో రూ.4,000 తగ్గింపుతో ఇప్పుడు ఈ ఫోన్ ను పొందవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్స్ లో ఉండే ఫీచర్స్, కెమెరా, బ్యాటరీ మెరుగ్గా ఉండటంతో దీనిని కొనడం వల్ల అన్ని రకాలుగా ఉపయోగాలు ఉన్నాయని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. ఇంతకీ ఈ మొబైల్ పై ధర ఎంత తగ్గుతుంది? ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి?
iPhone 16 మొబైల్ ఏడాది కిందటే మార్కెట్ లోకి వచ్చింది. అప్పటినుంచి ఇప్పటివరకు దీని ఆదరణ ఏమాత్రం తగ్గలేదు అని తెలుస్తుంది. అయినా కూడా ఇటీవల దీని ధరను తగ్గించారు. అయితే ఇందులో ఆకట్టుకునే ఫీచర్లు కూడా ఉన్నాయి. మొబైల్ ఫాస్ట్ నెస్ కోసం 8 జిబి రామ్ ను చేర్చారు. ఇది A18 చిప్ తో పని చేస్తుంది. గేమింగ్ కోరుకునే వారితోపాటు ఫాస్టెస్ట్ మూవింగ్ కోసం ఈ మొబైల్ ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు.. అలాగే ఇందులో Tensor G4 వంటి ప్రాసెసర్ ఉండడంతో ఫోన్ లో ఒకేసారి ఎన్నో రకాల యాప్స్ ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు.
ఈ మొబైల్లో 6.7 అంగుళాల OLED డిస్ప్లేను అమర్చారు. దీంతో మూవీస్ చూసేవారితో పాటు గేమింగ్ కోరుకునే వారికి ఇది అనుగుణంగా ఉంటుంది. ఈ డిస్ప్లే 60 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేయడంతో వీడియోలు క్వాలిటీ తో కనిపిస్తాయి. మీ మొబైల్లో మెయిన్ కెమెరా 48 MP తో పనిచేస్తుంది.12 MP అల్ట్రా వైడ్ సెన్సార్ తో ఉంటుంది. సెల్ఫీ కోసం కూడా అద్భుతమైన మెగాపిక్సల్ తో పనిచేస్తుంది. అలాగే 4k వీడియో రికార్డింగ్ కూడా దీని ద్వారా చేసుకోవచ్చు. ఈ మొబైల్లో ఉండే బ్యాటరీ మెరుగ్గా ఉండనుంది. ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఆరు గంటల వరకు నాన్ స్టాప్ యూస్ చేసినా కూడా ఇలాంటి చార్జింగ్ సమస్య లేకుండా ఉంటుంది. అలాగే 30 నిమిషాల్లో 50% వరకు చార్జింగ్ అయ్యే ఫాస్టెస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
ప్రస్తుతం మార్కెట్లో iPhone 16 మొబైల్ ను రూ.65,900 విక్రయిస్తున్నారు. అయితే టాప్ ఎండ్ వేరియంట్ మొబైల్ రూ.69,900 గా ఉంది. దీనిపై ప్లాట్ గా రూ.4,000 ధర డిస్కౌంట్ను పొందవచ్చు. అలాగే IDFC, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ.7,500 వరకు అదనపు తగ్గింపును పొందే అవకాశం ఉంటుంది. దీంతో ఐఫోన్ కొనాలని అనుకునేవారు తక్కువ ధరకే పొందే అవకాశం ఉంటుంది.
