Good news for Realme 11 Pro users: ఇటీవల Realme కంపెనీ కొన్ని ఆరోపణలు ఎదుర్కొంది. ఇందులో ఉన్న ఒక ఆప్షన్ వల్ల వినియోగదారుల పర్సనల్ డేటా లీక్ అవుతుందని కొందరు వినియోగదారులు ఆరోపణలు చేశారు. దీంతో చాలామంది రియల్ మీ అనడానికి ఆసక్తి చూపేవారు కాదు. ముఖ్యంగా Realme 11 Pro మొబైల్ లో ఉన్న డిఫాల్ట్ ఆప్షన్ తో వినియోగదారుల మెసేజ్, కాలింగ్ డేటా ఇతరులు చదవడానికి ఆస్కారం ఉందని భావించడంతో దీనిపై వివాదం ఏర్పడింది. అయితే ఈ ఆప్షన్ పై కంపెనీ లేటెస్ట్ గా కీలక నిర్ణయం తీసుకుంది. దీనిని డిఫాల్ట్ నుంచి పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది.
Realme 11 Pro అనే మొబైల్ లో Enhanced Intelligent Service వివాదంగా మారింది. ఇది మొబైల్లో ఇప్పటివరకు డిఫాల్ట్ గా ఉండేది. ఈ ఆప్షన్ వల్ల వినియోగదారుడి పూర్తి సమాచారం దొంగిలించబడుతుందని చాలామంది ఆరోపణలు చేశారు. దీనిపై కొందరు ప్రభుత్వానికి ఫిర్యాదు కూడా చేశారు. అయితే దీనిపై వివాదం నెలకొంటున్న నేపథ్యంలో కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. లేటెస్ట్ గా రియల్ మీ కి చెందిన కొన్ని మొబైల్స్ లో అప్డేట్ సాఫ్ట్వేర్ను తీసుకువచ్చింది. Realme UI 4.0 అనే సాఫ్ట్వేర్ తో Enhanced Intelligent Service డిఫాల్ట్ నుంచి తొలగించబడుతుంది. అయితే ఆ తర్వాత వినియోగదారుల ఆప్షన్ కు అవకాశం ఇస్తుంది. ఒకవేళ వినియోగదారులు కావాలనుకుంటే దీనిని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ కొత్త అప్డేట్ వరుసగా Realme 11 Pro, Realme 11 Pro Plus అనే మొబైల్స్ లో ఈ కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడంతో వినియోగదారుల మొబైల్స్ సేఫ్గా మారే అవకాశం ఉంది. అయితే ఈ అప్డేట్ ఆటోమేటిక్ గా అవడం లేదా అప్డేట్ చేయడం ద్వారా యాక్టివ్ అయిపోతుంది. లేదా మాన్యువల్ గా సెట్టింగ్స్ లోకి వెళ్లి సిస్టం సర్వీసెస్ లోకి వెళ్లి ఇన్ హార్సిడ్ ఇంటలిజెంట్ సర్వీస్ అనే ఆప్షన్ ను తొలగించుకోవచ్చు.
అయితే కొందరు రియల్ మీ కంపెనీ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రభుత్వ ఒత్తిడి కూడా ఉందని అంటున్నారు. రియల్ మీ మొబైల్ లో ఉన్న లోపం గురించి ఒక యూజర్ ట్విట్టర్లో పేర్కొనడంతో కేంద్ర సాంకేతిక మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అందించి కంపెనీ విషయంలో స్పందించినట్లు తెలుస్తోంది.