గూగుల్ పే కస్టమర్లకు గుడ్ న్యూస్.. యూజర్లకు డెబిట్ కార్డులు..?

దేశంలో యూపీఐ యాప్స్ ఉపయోగించే కస్టమర్లలో ఎక్కువ సంఖ్యలో కస్టమర్లు ఉపయోగించే యాప్ గూగుల్ పే. గూగుల్ పే యాప్ తమ యాప్ కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. గూగుల్ పే కొన్ని ఫీచర్ల ద్వారా ఇతర యాప్ లతో పోలిస్తే ఎక్కువగా కస్టమర్లను ఆకర్షిస్తోంది. స్క్రాచ్ కార్డుల ద్వారా క్యాష్ బ్యాక్ ఇస్తూ గెలుచుకున్న నగదును నేరుగా బ్యాంక్ ఖాతాలలో జమ చేస్తోంది. తాజాగా గూగుల్ పే […]

Written By: Navya, Updated On : November 18, 2020 9:30 pm
Follow us on


దేశంలో యూపీఐ యాప్స్ ఉపయోగించే కస్టమర్లలో ఎక్కువ సంఖ్యలో కస్టమర్లు ఉపయోగించే యాప్ గూగుల్ పే. గూగుల్ పే యాప్ తమ యాప్ కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. గూగుల్ పే కొన్ని ఫీచర్ల ద్వారా ఇతర యాప్ లతో పోలిస్తే ఎక్కువగా కస్టమర్లను ఆకర్షిస్తోంది. స్క్రాచ్ కార్డుల ద్వారా క్యాష్ బ్యాక్ ఇస్తూ గెలుచుకున్న నగదును నేరుగా బ్యాంక్ ఖాతాలలో జమ చేస్తోంది.

తాజాగా గూగుల్ పే కస్టమర్లకు మరో శుభవార్తను తీసుకొచ్చింది. గూగుల్ పే యాప్ వినియోగించే కస్టమర్లకు ట్విట్టర్ ద్వారా ఆ సంస్థ కోబ్రాండెడ్ డెబిట్ కార్డులను యాప్ వినియోగదారులకు అందించబోతున్నట్టు కీలక ప్రకటన చేసింది. భవిష్యత్తులో గూగుల్ పే కస్టమర్ల కోసం డిజిటల్ బ్యాంక్ అకౌంట్ సర్వీసులను కూడా అందుబాటులోకి తీసుకురానుందని ప్రచారం జరుగుతోంది. అయితే నిజంగా డిజిటల్ బ్యాంక్ అకౌంట్ సర్వీసులు అందుబాటులోకి వస్తాయో లేదో తెలియాల్సి ఉంది.

ఈ సంస్థ గూగుల్ యాప్ ను కొత్తగా ఆవిష్కరించడంతో పాటు మరిన్ని కొత్త సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. కో బ్రాండెడ్ డెబిట్ కార్డులతో పాటు రివార్డ్ ప్రోగ్రామ్స్ ను కూడా గూగుల్ పే అందుబాటులోకి తీసుకురానుందని సమాచారం. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తూ ఉండటంపై గూగుల్ పే యూజర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బిల్లుల పేమెంట్స్ ద్వారా కూడా గూగుల్ పే వినియోగదారులకు మేలు చేకూరుస్తోంది.

గ్యాస్ బుకింగ్, కరెంట్ బిల్లుల పేమెంట్, ఇతర బిల్లులను చెల్లించడం ద్వారా క్యాష్ బ్యాక్ లను పొందే అవకాశాన్ని గూగుల్ పే కల్పిస్తోంది. అయితే గతంతో పోలిస్తే స్క్రాచ్ కార్డుల ద్వారా గూగుల్ పే యాప్ నుంచి తక్కువ మొత్తం లభిస్తోందని కొందరు గూగుల్ పే యూజర్లు అభిప్రాయపడుతున్నారు.