నిరుద్యోగులకు శుభవార్త… ఐబీపీఎస్ లో 647 ఉద్యోగాలు..?

దేశంలో గత కొన్ని రోజులుగా బ్యాంకులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు నిరుద్యోగులకు వరుస శుభవార్తలు చెబుతున్నాయి. బ్యాంకు ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న వాళ్లకు ఐబీపీఎస్ నేడు మరో శుభవార్త చెప్పింది. 647 ఉద్యోగాల భర్తీ కోసం ఐబీపీఎస్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు సులువుగా ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ కు అభ్యర్థులు నవంబర్ నెల 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://www.ibps.in/ […]

Written By: Kusuma Aggunna, Updated On : November 18, 2020 9:38 pm
Follow us on

దేశంలో గత కొన్ని రోజులుగా బ్యాంకులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు నిరుద్యోగులకు వరుస శుభవార్తలు చెబుతున్నాయి. బ్యాంకు ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న వాళ్లకు ఐబీపీఎస్ నేడు మరో శుభవార్త చెప్పింది. 647 ఉద్యోగాల భర్తీ కోసం ఐబీపీఎస్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు సులువుగా ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ కు అభ్యర్థులు నవంబర్ నెల 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://www.ibps.in/ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 647 స్పెషలిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా వెబ్ సైట్ లో సీఆర్పీ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అనే లింక్ ను క్లిక్ చేసి అందులో కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ స్పెషలిస్ట్ ఆఫీసర్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

అందులో నోటిఫికేషన్ తో పాటు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగాలకు తగిన అర్హత ఉన్నవాళ్లు న్యూ రిజిస్ట్రేషన్ ను క్లిక్ చేసి వివరాలను నమోదు చేసి దరఖాస్తు ఫామ్ ను ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. స్పెషల్ ఆఫీసర్ ఉద్యోగాలలో హెచ్ఆర్, పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్, రాజ్ భాషా అధికారి, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, ఐటీ ఆఫీసర్ ఉద్యోగాలు ఉంటాయి.

రోజురోజుకు దేశంలో నిరుద్యోగం పెరుగుతున్న తరుణంలో వెలువడుతున్న నోటిఫికేషన్ల వల్ల తమకు ప్రయోజనం చేకూరుతోందని నిరుద్యోగులు అభిప్రాయపడుతున్నారు. కరోనా, లాక్ డౌన్ వల్ల పోటీ పరీక్షలు ఆలస్యంగా నిర్వహిస్తున్నా వరుసగా వెలువడుతున్న నోటిఫికేషన్ల వల్ల తమకు మంచే జరుగుతోందని నిరుద్యోగులు చెబుతున్నారు.