ఆ హోటళ్లలో నిద్రపోతే లక్షన్నర జీతం.. ఎలా సంపాదించాలంటే..?

దేశంలో చాలామంది తక్కువ శ్రమతో ఎక్కువ వేతనం పొందాలని ఆలోచిస్తూ ఉంటారు. అయితే దేశంలో మెజారిటీ సంస్థలు పనికి తగిన వేతనాన్ని మాత్రమే అందిస్తూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు మాత్రం కొన్ని కంపెనీలు లక్షల వేతనంతో సులభంగా చేసే జాబ్స్ ను కల్పిస్తూ ఉంటాయి. ఎటువంటి శ్రమ లేకుండా ఫైవ్ స్టార్ హోటళ్లలో ప్రశాంతంగా నిద్రపోయి ఆ నిద్రకు సంబంధించిన అనుభవాలను చెప్పడం ద్వారా లక్షల్లో వేతనం పొందవచ్చు. విదేశాల్లోని కొన్ని ప్రముఖ హోటళ్లు బెడ్ టెస్టర్ […]

Written By: Kusuma Aggunna, Updated On : November 18, 2020 9:22 pm
Follow us on

దేశంలో చాలామంది తక్కువ శ్రమతో ఎక్కువ వేతనం పొందాలని ఆలోచిస్తూ ఉంటారు. అయితే దేశంలో మెజారిటీ సంస్థలు పనికి తగిన వేతనాన్ని మాత్రమే అందిస్తూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు మాత్రం కొన్ని కంపెనీలు లక్షల వేతనంతో సులభంగా చేసే జాబ్స్ ను కల్పిస్తూ ఉంటాయి. ఎటువంటి శ్రమ లేకుండా ఫైవ్ స్టార్ హోటళ్లలో ప్రశాంతంగా నిద్రపోయి ఆ నిద్రకు సంబంధించిన అనుభవాలను చెప్పడం ద్వారా లక్షల్లో వేతనం పొందవచ్చు.

విదేశాల్లోని కొన్ని ప్రముఖ హోటళ్లు బెడ్ టెస్టర్ ఉద్యోగాల కోసం ఉద్యోగులను నియమించుకుని లక్షల రూపాయల వేతనం చెల్లిస్తున్నాయి. యూకేకు చెందిన టిల్లే – లవ్ లగ్జరీ అనే సంస్థ ప్రశాంతంగా నిద్రపోయే వారి నుంచి దరఖాస్తులను కోరుతోంది. తమ హోటళ్లలో రెస్ట్ తీసుకుని ఆ అనుభవాన్ని పంచుకోవడం ద్వారా డబ్బు సంపాదించే అవకాశాన్ని టిల్లే – లవ్ లగ్జరీ సంస్థ కల్పిస్తోంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే మాత్రం జాక్ పాట్ కొట్టినట్టే అని చెప్పాలి.

ఎవరైతే ఉద్యోగాలకు ఎంపికవుతారో సంస్థ వారిని సొంత ఖర్చులతో విదేశాల్లోని ఫైవ్ స్టార్ హోటళ్లకు పంపుతుంది. ఆ ఫైవ్ స్టార్ హోటళ్లలో హ్యాపీగా నిద్రపోవడం ద్వారా వేతనాన్ని పొందవచ్చు. ఫైవ్ స్టార్ బెడ్ టెస్టర్ పేరుతో పిలిచే ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లు 30 రోజుల కాలవ్యవధిలో ఐదుసార్లు హోటళ్లలో విడిది చేయాల్సి ఉంటుంది. ఒంటరిగా హోటళ్లలో ఉండటానికి భయపడేవాళ్లు తోడుగా మరొకరికి తీసుకెళ్లవచ్చు.

అయితే యూకే పౌరులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి మన దేశ కరెన్సీ ప్రకారం లక్షన్నర వేతనంగా లభిస్తుంది. ఉద్యోగానికి ఎంపికైన వారు పడుకునే బెడ్ సౌకర్యవంతంగా ఉందా..? లేదా..? ఏవైనా లోపాలు ఉన్నాయా..? అనే విషయాలను సంస్థకు తెలియజేయాల్సి ఉంటుంది