PM Kisan:  రైతులకు కేంద్రం శుభవార్త.. ఖాతాలో రూ.2,000 జమయ్యేది ఎప్పుడంటే?

PM Kisan: కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ అమలు చేస్తున్న స్కీమ్స్ లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ కూడా ఒకటనే సంగతి తెలిసిందే. త్వరలో పీఎం కిసాన్ పదో విడత నిధి ఖాతాలో జమ కానుంది. 2022 సంవత్సరం కొత్త సంవత్సరం రోజున మోదీ రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ స్కీమ్ నగదును జమ చేయనున్నారు. రైతులకు ఇప్పటికే ఈ మేరకు మెసేజ్ లు వచ్చాయి. మోదీ సర్కార్ అదే రోజున […]

Written By: Kusuma Aggunna, Updated On : December 23, 2021 7:06 pm
Follow us on

PM Kisan: కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ అమలు చేస్తున్న స్కీమ్స్ లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ కూడా ఒకటనే సంగతి తెలిసిందే. త్వరలో పీఎం కిసాన్ పదో విడత నిధి ఖాతాలో జమ కానుంది. 2022 సంవత్సరం కొత్త సంవత్సరం రోజున మోదీ రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ స్కీమ్ నగదును జమ చేయనున్నారు. రైతులకు ఇప్పటికే ఈ మేరకు మెసేజ్ లు వచ్చాయి. మోదీ సర్కార్ అదే రోజున రైతు ఉత్పత్తి సంస్థలకు ఈక్విటీ గ్రాంట్లను కూడా రిలీజ్ చేయనుంది.

PM Kisan

pmindiawebcast.nic.in వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ స్కీమ్ కు అర్హత ఉన్నవాళ్లు వెబ్ సైట్ ద్వారా తమ పేరును చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనాలను పొందాలని భావించేవాళ్లు https://pmkisan.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి ఫార్మర్స్ కార్నర్ విభాగంలో లబ్ధిదారుల జాబితా ఆనే ఆప్షన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.

Also Read: సినిమా టికెట్ల తగ్గింపు వివాదం: ప్రశ్నించిన హీరో నానిని టార్గెట్ చేసి వైసీపీ.. తప్పెవరిది?
ఆ తర్వాత డ్రాప్ డౌన్ జాబితా ద్వారా రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్, గ్రామాన్ని ఎంచుకుని గెట్ రిపోర్ట్ ఆప్షన్ పై క్లిక్ చేసి అందులో ఉండే లబ్ధిదారుల జాబితాలో పేరును తనిఖీ చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. రైతులు ఇన్‌స్టాల్‌మెంట్ స్థితిని తెలుసుకోవాలని భావిస్తే మొదట పీఎం కిసాన్ వెబ్ సైట్ లోకి వెళ్లి ఫార్మర్స్ కార్నర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

ఆ తర్వాత బెనిఫిషియరీ స్టేటస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కొత్త పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఆధార్ నంబర్, మొబైల్ నంబర్‌ ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఖాతాకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

Also Read: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. ఇలా చేస్తే మీ అకౌంట్ పని చేయదట!