Compact SUV Car : కాంపాక్ట్ ఎస్ యూవీ కారు కొనేవారికి గుడ్ న్యూస్.. తక్కువ ధరలో ఉన్న టాప్ 5 మోడల్స్ ఇవే..

కాంపాక్ట్ ఎస్ యూవీ కారును కొనాలనుకునేవారు టాప్ కార్ల గురించి తెలుసుకుంటారు. ప్రస్తుతం ఆటోమోబైల్ మార్కెట్లో ఉన్న టాప్ 5 కాంపాక్ట్ ఎస్ యూవీలు ఏవో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వివరాల్లోకి వెళ్లండి..

Written By: Srinivas, Updated On : September 20, 2024 12:05 pm

Compact SUV Car

Follow us on

Compact SUV Car : కార్లు కొనేవారిలో ఎక్కువ శాతం SUVల ను కోరుకుంటారు. ఎందుకంటే ఇవి సెడాన్ కార్ల కంటే ఎక్కువ స్పేస్ ఉండడంతో పాటు ఇంజిన్ మెరుగ్గా ఉంటుంది. అంతేకాకుండా లాంగ్ ట్రిప్ వేసేవారికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఇవి అధిక ధరను కలిగి ఉండడంతో వీటిని పోలిన కాంపాక్ట్ SUVలు మార్కెట్లోకి వచ్చాయి. ఇవి ధర తక్కువను కలిగి ఉండి ఎస్ యూవీని పోలి ఉంటాయి. కాంపాక్ట్ ఎస్ యూవీ కార్లలో బూట్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి అదనపు ఫీచర్లు ఉంటాయి.ఈ నేపథ్యంలో కొన్ని కాంపాక్ట్ ఎస్ యూవీలకు డిమాండ్ పెరుగుతుంది. అయితే కాంపాక్ట్ ఎస్ యూవీ కారును కొనాలనుకునేవారు టాప్ కార్ల గురించి తెలుసుకుంటారు. ప్రస్తుతం ఆటోమోబైల్ మార్కెట్లో ఉన్న టాప్ 5 కాంపాక్ట్ ఎస్ యూవీలు ఏవో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వివరాల్లోకి వెళ్లండి..

దేశంలో మారుతి కార్లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ప్రతీ కారు వాల్యూయేబుల్ అని కొందరి అభిప్రాయం. ఈ తరుణంలో దీని నుంచి రిలీజ్ అయినా కాంపాక్ట్ ఎస్ యూవీ వేరియంట్ లో ‘ ఇగ్నీస్’ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇది కాంపాక్ట్ ఎస్ యూవీ అయినా 5 మంది సౌకర్యవంతంగ కూర్చోవడంతో పాటు బూట్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు 113 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేసే ఈ కారు 5 స్పీడ్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. ఇది లీటర్ పెట్రోల్ కు 21 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీనిని రూ.6.96 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.

హ్యుందాయ్ నుంచి ఎక్స్ టర్ టాప్ 2 కాంపాక్ట్ ఎస్ యూవీగా గుర్తింపు తెచ్చుకుంది. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు 83 బీహెచ్ పీ పవర్, 113 ఎన్ ఎం టార్క్ ను రిలీజ్ చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ తో పాటు ఏఎంటీ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. ఇది లీటర్ పెట్రోల్ కు 19.4 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీనిని రూ. 6.13 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. కాంపాక్ట్ ఎస్ యూవీ అయినా ఎక్స్ టర్ మంచి డిజైన్ ను కలిగి ఉంటుంది.

దేశంలో అత్యధికంగా విక్రయాలు జరుపుకుంటున్న కార్లలో టాటా కంపెనీకి చెందినవి ఉన్నాయి. ఈ కంపెనీకి చెందిన పంచ్ బెస్ట్ కాంపాక్ట్ ఎస్ యూవీగా ప్రత్యేకత సాధించింది. ఈ మోడల్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు 86 బీహెచ్ పీ పవర్ , 113 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది. పంచ్ ను రూ.6.12 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఇది 20.1 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

నిస్సాన్ కంపెనీకి చెందిన మాగ్నెట్ కారు బెస్ట్ కాంపాక్ట్ ఎస్ యూవీగా నిలుస్తుంది. ఈ కారు 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 70 బీహెచ్ పీ పవర్, 96 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది. ఈ కారు ఇన్నర్ లో 336 లీటర్ల బూట్ స్పేస్ ను కలిగి ఉంది. దీనిని రూ. 5.99 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.

రెనాల్ట్ కంపెనీకి చెందిన కిగర్ కాంపాక్ట్ ఎస్ యూవీగా ఆకర్షిస్తుంది. ఇందులో ఎక్కువగా 405 లీటర్ల బూట్ స్పేస్ ను కలిగి ఉంది. 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు 72 బీహెచ్ పీ పవర్, 96 ఎన్ఎం టార్క్ ను రిలీజ్ చేస్తుంది. ఇందులో 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో పాటు ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను కలిగి ఉన్నాయి.