Youth Credit Card:  18 నుంచి 45 ఏళ్ల వారికి శుభవార్త.. తక్కువ వడ్డీకే రూ.20 లక్షల రుణం!

Youth Credit Card:  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను అమలు చేస్తుండగా ఈ పథకాల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతోమంది బెనిఫిట్స్ ను పొందుతున్నారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ యువకులు లక్ష్యంగా ఒక అద్భుతమైన స్కీమ్ ను ప్రకటించింది. యువ ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలనే ఆలోచనతో టీఎంసీ యువ శక్తి క్రెడిట్ కార్డు‌ స్కీమ్ ను ప్రకటించింది. ఈ క్రెడిట్ కార్డ్ సహాయంతో తక్కువ వడ్డీరేటుకే 20 లక్షల రూపాయల వరకు లోన్ పొందవచ్చు. ఈ […]

Written By: Navya, Updated On : January 3, 2022 4:49 pm
Follow us on

Youth Credit Card:  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను అమలు చేస్తుండగా ఈ పథకాల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతోమంది బెనిఫిట్స్ ను పొందుతున్నారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ యువకులు లక్ష్యంగా ఒక అద్భుతమైన స్కీమ్ ను ప్రకటించింది. యువ ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలనే ఆలోచనతో టీఎంసీ యువ శక్తి క్రెడిట్ కార్డు‌ స్కీమ్ ను ప్రకటించింది. ఈ క్రెడిట్ కార్డ్ సహాయంతో తక్కువ వడ్డీరేటుకే 20 లక్షల రూపాయల వరకు లోన్ పొందవచ్చు.

ఈ పథకం ద్వారా రుణం తీసుకున్న వాళ్లకు వడ్డీరేటు కేవలం 4 శాతంగా ఉండటం గమనార్హం. గోవాలో టీఎంసీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఈ స్కీమ్ ను అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ క్రెడిట్ కార్డ్ సహాయంతో యువత తన కాళ్ల మీద తను నిలబడాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ స్కీమ్ ద్వారా పొందే లోన్ కు ప్రభుత్వం గ్యారంటర్ గా ఉండనుంది.

ఆర్థిక సంస్థలతో ఈ మేరకు టీఎంసీ – ఎంజీపీ పార్టీలు ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. ఈ రెండు పార్టీలు అధికారంలోకి వస్తే మాత్రమే ఈ స్కీమ్ అమలు జరగనుంది. దేశంలో ఎక్కువ నిరుద్యోగిత రేటు ఉన్న రాష్ట్రాలలో గోవా ఒకటని చెప్పవచ్చు. తీసుకున్న రుణం ద్వారా యువత ఉన్నత చదువులు చదవడం, వ్యాపారాలు చేయడం, నైపుణ్యాలను పెంచుకోవడం చేయవచ్చు.

ఈ స్కీమ్ అమలు వల్ల డబ్బులు అవసరమైన యువతకు ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరుతుంది. తెలుగు రాష్ట్రాలలో కూడా ఇలాంటి స్కీమ్స్ అమలులోకి వస్తే బాగుంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాలు ఇలా చేయడం వల్ల నిరుద్యోగుల రేటు తగ్గే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.