Gold Sale: బంగారం కొనేవారికి హెచ్చరిక..! ఈ మోసం జరగవచ్చు..

ఉదాహరణకు 50 గ్రాముల బంగారం కొనుగోలు చేశారనుకోండి. దీని ధర రూ. 3 లక్షలు అయ్యాయనుకుంది. అయితే సాధారణంగా జువెల్లరీ షాపులో బంగారం కొనుగోలు చేయడం ద్వారా ఈ బంగారం కొనుగోలుపై అదనగా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. కొనుగోలు చేసిన బంగారంపై 3 శాత జీఎస్టీని విధిస్తారు. కానీ కొందరు షాపు వారు కొనుగోలు దారులకు తెలియకుండా మేకింగ్ చార్జిలపై కూడా విధిస్తున్నారు.

Written By: Chai Muchhata, Updated On : April 19, 2024 11:32 am

Gold Prices

Follow us on

Gold Sale:  బంగారం ధరలు మండిపోతున్నాయి. తులం బంగారం రూ.65 వేల కంటే దిగి రావడం లేదు. అయినా గోల్డ్ ను కొనేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. బంగారం డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని కొందరు షాపు నిర్వాహకులు కస్టమర్ల నుంచి అదనంగా డబ్బలు వసూలు చేస్తున్నారు. ముఖ్యండా GST ని అవసరం లేని దానికి విధిస్తూ దోచుకుంటున్నారు. ఇది తెలియని కొందరు కొనుగోలుదారులు అదనంగా షాపు వారికి ముట్టజెప్పి వస్తున్నారు. కానీ దీనిపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ఇంతకీ బంగారం కొనేటప్పుడు ఎలాంటి మోసం జరుగుతుందంటే?

డిమాండ్ ఎక్కువగా ఉండడంతో బంగారం షాపులుల కోకోల్లలుగా వెలిశాయి. అయితే వినియోగదారులను ఆకర్షించడానికి తరుగు, తదితర ఛార్జీలు వేయమని చెబుతూ ఉంటారు. కొందరైతే ఎలాంటి మేకింగ్ చార్జీలు కూడా తీసుకోకుండా విక్రయిస్తామని చెబతున్నారు. కానీ కొనుగోలుదారులకు తెలియకుండా అదనంగా జీఎస్టీని విధిస్తారు. దీంతో కొందరు తక్కువ ధరకే బంగారం కొనుగోలు చేశామని అనుకున్నా.. ఓవరాల్ గా ఎక్కువే చెల్లిస్తున్నారు.

ఉదాహరణకు 50 గ్రాముల బంగారం కొనుగోలు చేశారనుకోండి. దీని ధర రూ. 3 లక్షలు అయ్యాయనుకుంది. అయితే సాధారణంగా జువెల్లరీ షాపులో బంగారం కొనుగోలు చేయడం ద్వారా ఈ బంగారం కొనుగోలుపై అదనగా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. కొనుగోలు చేసిన బంగారంపై 3 శాత జీఎస్టీని విధిస్తారు. కానీ కొందరు షాపు వారు కొనుగోలు దారులకు తెలియకుండా మేకింగ్ చార్జిలపై కూడా విధిస్తున్నారు. అయితే చాలా మంది ఇది నిజం కావొచ్చని వారు చెప్పినంత ఇస్తున్నారు. కానీ ఎప్పుడూ బంగారంపై మాత్రమే జీఎస్టీ ఉంటుంది. మేకింగ్ పై ఎటువంటి ఛార్జీలు ఉండవు. అందవల్ల బంగారం కొనుగోలు చేసేటప్పుడు ఈ విషయం కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి.