Gold Sale: బంగారం అమ్మాలంటే ఈ ట్యాక్స్ చెల్లించాలా? ఎందుకు? ఎప్పుడు?

వ్యాపారస్తులు షేర్ మార్కెట్లో పెట్టే పెట్టుబడులపై ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. వీటిలో ఈక్వీటీ లాభాలపై 10 శాతం దీర్ఘకాలిక మూలధన రాబడి పన్నుగా ప్రభుత్వానికి చెల్లించాలి. ఒక వ్యక్తి స్టాక్ మార్కెట్లో ఏడాదికి పైగా రూ. 50 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే రూ. 1 లక్ష వచ్చాయనుకుంది. దీనిపై ప్రభుత్వం పన్ను విధిస్తుంది. దీనిని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పే అంటారు.

Written By: Chai Muchhata, Updated On : May 1, 2024 4:40 pm

Shocking Gold Rates

Follow us on

Gold Sale:   బంగారం పేరు ఇటీవల మారు మోగుతోంది. సామాన్యుడికి అందనంత ఎత్తులో పెరుగుదల ఉంటోంది. తులం బంగారం రూ.70 వేల కంటే కిందికి రానంటోతంది. ఒకవేళ తగ్గినా స్వల్పంగానే ఉంటోంది. అయితే బంగారం ధరలు పెరుగుతున్నా.. దీనిపై వినియోగదారుల మనసు మాత్రం తగ్గడం లేదు. ధరలతో సంబంధం లేకుండా కొనుగోళ్లు చేస్తున్నారు. ముఖ్యంగా మే 10న అక్షయ తృతీయ వస్తున్నందున ఆ రోజు బంగారం ధర ఎక్కువగా ఉంటుందని భావించి.. చాలా మంది ముందే కొనుగోళ్లు చేస్తున్నారు. అయితే కొందరు ధరలు పెరిగినందున నిల్వ ఉంచుకున్న బంగారాన్ని విక్రయిస్తున్నారు. బంగారాన్ని విక్రయించాలంటే ట్యాక్స్ పే చేయాలన్న విషయం చాలా మందికి తెలియదు. అదెలాగంటే?

వ్యాపారస్తులు షేర్ మార్కెట్లో పెట్టే పెట్టుబడులపై ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. వీటిలో ఈక్వీటీ లాభాలపై 10 శాతం దీర్ఘకాలిక మూలధన రాబడి పన్నుగా ప్రభుత్వానికి చెల్లించాలి. ఒక వ్యక్తి స్టాక్ మార్కెట్లో ఏడాదికి పైగా రూ. 50 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే రూ. 1 లక్ష వచ్చాయనుకుంది. దీనిపై ప్రభుత్వం పన్ను విధిస్తుంది. దీనిని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పే అంటారు. స్టాక్స్ తో పాటు బంగారం, వెండి కొనుగోలు చేసి వాటిని కనీసం మూడు సంవత్సరాల పాటు నిల్వ ఉంచుకొని ఆ తరువాత అమ్మకానికి పెడితే వాటిపై వాటికి ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అయితే వీటిపై షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వసూలు చేస్తారు.

అయితే అన్ని దేశాల్లో ఇది అమలు లేదు. అంతేకాకుండా వ్యక్తి యొక్క ఆదాయాన్ని బట్టి పన్ను వసూలు చేస్తారు. దీంతో అందరూ ఒకే రకమైన పన్ను చెల్లిస్తారని అనుకోవద్దు. అయితే బంగారం అమ్మిన తరువాత వచ్చిన మొత్తాన్ని ఇల్లు కొనడానికి ఉపయోగిస్తే మాత్రం దానిని ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 54 ఎఫ్ కింద మినహాయింపుకు పెట్టుకోవడం ద్వారా ట్యాక్స్ నుంచి రిలీఫ్ దొరుకుతుంది. కానీ నిబంధనల ప్రకారం ఈ మొత్తాన్ని ఇల్లు కొనుగోలుకే కేటాయించినట్లు సరైన పత్రాలు ఉండాలి.

ఒక్కోసారి ఇల్లు కోసం తీసుకోకపోయినా బంగారం కొని నిల్వ ఉంచుకున్న దానిపై ట్యాక్స్ ఏర్పడితే దానిపై 20 శాతం ట్యాక్స్ విధిస్తారు. దీనిని మినహాయించుకునేందకు ఆదాయపు పన్నులో క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ కూడా వ్యక్తి ఆదాయాన్ని బట్టి మాఫీ ఉంటుంది. ఇలాంటప్పుడు ఆభరణాలు విక్రయించడానికి ముందే ఇల్లు కొనుగోలుకు సంబంధించిన పత్రాలు ఉంటే వాటిని ఆదాయపు పన్నులో క్లెయిమ్ చేసుకోవడం ద్వారా ఈజీగా పన్ను నుంచి తప్పించుకోవచ్చు.