Gold Rates Today: తగ్గినట్లే తగ్గి.. భారీ షాక్ ఇచ్చిన ధరలు..

బులియన్ మార్కెట్ ప్రకారం.. జూన్ 12న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,850గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.71,840 గా ఉంది. జూన్ 11న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.65,700తో విక్రయించారు. 10 గ్రాముల బంగారం ధర మంగళవారంతో పోలిస్తే బుధవారం రూ.150 పెరిగింది.

Written By: Chai Muchhata, Updated On : June 12, 2024 8:43 am

Shocking Gold Rates

Follow us on

Gold Price Today: బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి భారీగా షాక్ ఇచ్చాయి. మూడు రోజుల పాటు బంగారం దాదాపు రూ.2000 వరకు తగ్గి స్వల్పంగా పెరిగింది. వెండి మాత్రం ఏకంగా రూ.1200 తగ్గింది. అంతర్జాతీయంగా బంగారం ధరలు చూస్తే.. స్పాట్ గోల్డ్ ఔన్స్ కు 2,313 డాలర్లుగా నమోదైంది. సిల్వర్ ఔన్స్ కు 29.25 డాలర్లు పలికింది. దేశీయంగా బుధవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

బులియన్ మార్కెట్ ప్రకారం.. జూన్ 12న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,850గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.71,840 గా ఉంది. జూన్ 11న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.65,700తో విక్రయించారు. 10 గ్రాముల బంగారం ధర మంగళవారంతో పోలిస్తే బుధవారం రూ.150 పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,010 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.72,000గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.65,860 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.71,850 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.66,460 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,500తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.65,850 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.71,850తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.65,850తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.71,850తో విక్రయిస్తున్నారు.

బంగారం పెరిగినా వెండి ధరలు తగ్గాయి. బుధవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.95,000గా నమోదైంది. మంగళవారంతో పోలిస్తే బుధవారం రూ.1200 తగ్గింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.90,500గా ఉంది. ముంబైలో రూ.90,500, చెన్నైలో రూ.94,900 బెంగుళూరులో 90,100, హైదరాబాద్ లో రూ. 94,900 తో విక్రయిస్తున్నారు.