Delhi Metro: ఢిల్లీ మెట్రోలో రెచ్చిపోయిన అమ్మాయిలు.. వీడియో వైరల్‌!

గతంలో రీల్స్‌ కోసం యువతీ యువకులు మెట్రోను అడ్డాగా మార్చుకున్నారు. షూటింగ్‌స్పాట్‌గా ఎంపిక చేసుకున్నారు. దీంతో సోషల్‌ మీడియాలో వరుసగా వీడియోలు వైరల్‌ అయ్యాయి.

Written By: Raj Shekar, Updated On : June 12, 2024 8:37 am

Delhi Metro

Follow us on

Delhi Metro: సోషల్‌ మీడియాలో లైక్స్, షేర్స్‌ కోసం ఇటీవల యువత రచ్చ రచ్చ చేస్తున్నారు. కొన్నిసార్లు ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. కొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. ఆ మధ్య మెట్రో రైళ్లలో కూడా డ్యాన్సులు, అశ్లీల పనులు చేశారు. దీంతో మెట్రో అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. చాలా రోజుల తర్వాత మళ్లీ ఢిల్లీ మెట్రోలో అమ్మాయిలు రెచ్చిపోయారు. గ్రూపుగా డ్యాన్స్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

గతంలో వరుసగా..
గతంలో రీల్స్‌ కోసం యువతీ యువకులు మెట్రోను అడ్డాగా మార్చుకున్నారు. షూటింగ్‌స్పాట్‌గా ఎంపిక చేసుకున్నారు. దీంతో సోషల్‌ మీడియాలో వరుసగా వీడియోలు వైరల్‌ అయ్యాయి. దీంతో ఢిల్లీ మెట్రో అథారిటీ రైలులో రీల్స్‌ చేస్తున్నవారిపై కఠిన చర్యలు చేపట్టింది. అయినా కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న యువతీ యువకులు మళ్లీ రెచ్చిపోతున్నారు.

తాజాగా డ్యాన్సింగ్‌..
తాజాగా ఢిల్లీ మెట్రోలో ఇద్దరు యువతులు కలిసి డ్యాన్స్‌ చేశారు. దీనిని ప్రయాణికులు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టారు. తోటి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నా.. కనీస స్పృహ లేకుండా రెచ్చిపోయారు. భోజ్‌పురి పాటకు రాడ్‌ పక్కన నిలబడి స్టెప్పులు వేశారు. కొంతమంది వీరిని పట్టించుకోనట్లు ఉండగా, మరికొందరు అసహనం వ్యక్తం చేశారు.

ఎక్స్‌లో వీడియో పోస్టు..
మెట్రోలో యువతుల డ్యాన్స్‌కు సంబందించిన వీడియో ఎక్స్‌లో మొదట పోస్టు అయింది. మహేంద్రసింగ్‌ అనే యూజర్ ఈ వీడియోను పోస్టు చేశాడు. ఈ రీల్స్‌ చేసేవాళ్ల కోసం ఒకటి రెండు మెట్రో రైళ్లు నడపండి రాబాబూ.. ఎక్కడ చూసినా ఈ రీల్స్‌ గోలే.. ఈ జాడ్యం ముంబై మెట్రోకి విస్తరించకూడదు అంటూ అసహనం వ్యక్తం చేశారు.