https://oktelugu.com/

Gold Rates Today: మళ్లీ లక్షకు చేరిన వెండి.. బంగారం ధరలూ జంప్..

Gold Price Today: కొన్ని రోజులుగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు మరోసారి గరిష్ట స్థాయికి చేరాయి. 24 క్యారెట్ల బంగారం రూ.300 పెరిగి రూ.73,760 గా నమోదైంది. వెండి మాత్రం రూ.3వేలకు పైగా పెరిగి లక్షకు చేరువైంది.

Written By:
  • Srinivas
  • , Updated On : June 8, 2024 / 07:00 AM IST

    Sivver and gold

    Follow us on

    Gold Price Today: కొన్ని రోజులుగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు మరోసారి గరిష్ట స్థాయికి చేరాయి. 24 క్యారెట్ల బంగారం రూ.300 పెరిగి రూ.73,760 గా నమోదైంది. వెండి మాత్రం రూ.3వేలకు పైగా పెరిగి లక్షకు చేరువైంది. దీంతో ఇప్పట్లో బంగారం కొనడం కష్టమేనంటున్నారు. దేశీయంగా గురువారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

    బులియన్ మార్కెట్ ప్రకారం.. జూన్ 8న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,600గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.73,760 గా ఉంది. జూన్ 7న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.67,300తో విక్రయించారు. 10 గ్రాముల బంగారానికి శుక్రవారంతో పోలిస్తే శనివారం రూ.300 పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

    న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,760 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.73,900గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.67,600 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.73,760 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.68,400 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.74,630తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.67,600 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.73,760తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.67,600తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.73,760తో విక్రయిస్తున్నారు.

    బంగారం ధరలతో పాటు వెండి ధరలు భారీగా పెరిగాయి. శనివారం ఓవరాల్ గా కిలో వెండి రూ.96,000గా నమోదైంది. శుక్రవారంతో పోలిస్తే శనివారం రూ.3000లకు పైగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.96,000గా ఉంది. ముంబైలో రూ.96,000, చెన్నైలో రూ.1,06,600 బెంగుళూరులో 93,350, హైదరాబాద్ లో రూ. 1,00,600 తో విక్రయిస్తున్నారు.