Gold Rates Today: నిన్న గుడ్ న్యూస్.. నేడు షాకింగ్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..

Gold Price Today: బంగారం ధరలపై నిన్న గుడ్ న్యూస్ విన్నారో లేదు.. నేడు షాకింగ్ వార్త వినాల్సి వచ్చింది. నిన్న స్వల్పంగా తగ్గి నేడు భారీగా పెరిగింది. అటు వెండి సైతం ఎగబాకింది.

Written By: Srinivas, Updated On : June 16, 2024 7:16 am

Gold Rates In Holy

Follow us on

Gold Price Today: బంగారం ధరలపై నిన్న గుడ్ న్యూస్ విన్నారో లేదు.. నేడు షాకింగ్ వార్త వినాల్సి వచ్చింది. నిన్న స్వల్పంగా తగ్గి నేడు భారీగా పెరిగింది. అటు వెండి సైతం ఎగబాకింది. అంతర్జాతీయంగా బంగారం ధరలు చూస్తే.. స్పాట్ గోల్డ్ ఔన్స్ కు 2333 డాలర్లుగా నమోదైంది. సిల్వర్ ఔన్స్ కు 29.57 డాలర్లు పలికింది. దేశీయంగా శనివారం  బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

బులియన్ మార్కెట్ ప్రకారం.. జూన్ 16న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,500గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.72,500 గా ఉంది. జూన్ 15న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.65,900తో విక్రయించారు. 10 గ్రాముల బంగారం ధర శనివారంతో పోలిస్తే ఆదివారం రూ.600 పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,650 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.72,700గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,650 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.72,550 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.67,050 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.73,150తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.66,650 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,550తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,650తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,550తో విక్రయిస్తున్నారు.

బంగారం ధరలతో పాటు వెండి ధరలు పెరిగాయి. ఆదివారం ఓవరాల్ గా కిలో వెండి రూ.91,000గా నమోదైంది. శనివారంతో పోలిస్తే ఆదివారం రూ.500 పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.91,000గా ఉంది. ముంబైలో రూ.91,000, చెన్నైలో రూ.95,600 బెంగుళూరులో 90,300, హైదరాబాద్ లో రూ. 95,600 తో విక్రయిస్తున్నారు.