Gold Rate September 30: బంగారం మరోసారి పెరిగింది. రోజురోజుకు పెరగడమే కానీ.. దీని ధరలు తగ్గడం లేదు. లక్ష రూపాయలు ఉన్నప్పుడే భయాంధోళన చెందిన కొనగోలుదారులు.. ఇప్పుడు రూ.2 లక్షలకు కూడా చేరుతుందని తెలుస్తుండడంతో మరింత షాక్ తింటున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే త్వరలో బంగారం ధరలు రూ.2 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతర్జాతీయ పరిస్థితులతో పాటు పెట్టుబడిదారులు దీనిపై ఇన్వెస్ట్ మెంట్ చేయడంతో బంగారం ధరలు పెరుగుతున్నాయని తెలుస్తోంది. మరి ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
బులియన్ మార్కెట్ ప్రకారం సెప్టెంబర్ 30 ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి రూ.1,08,450 నమోదైంది. 24 క్యారెట్ల బంగారం కొనాలంటే రూ.1,18,310 చెల్లించాలి. న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,08,600 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,18,460గా నమోదైంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,08,450 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,18,310గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,08,650 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,18,450గా నమోదైంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,08,450 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,18,310గా నమోదైంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,08,450కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,18,310గా నమోదైంది. వెండి ధరలు సైతం పెరుగుతున్నాయి. కిలో వెండి ధర రూ.1,61,000గా ఉంది.
బంగారం ధరలు సోమవారం కంటే మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాములు రూ.1,300 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం రూ.1,420 పెరిగింది. అటు వెండి రూ.1,000 పెరిగింది. రోజురోజుకు బంగారం ధరలు పెరుగుతుండడంతో తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనన వాతావరణం నెలకొంది. ప్రస్తుతం పండుగల సీజన్ కావడంతో పాటు శుభకార్యాలు నిర్వహించుకునే అవకాశం ఉండడంతో చాలా మంది బంగారం కొనాలని చూస్తున్నారు. కానీ ధరలు విపరీతంగా పెరగడంతో ఆందోళనన చెందుతున్నారు.
మరోవైపు బంగారం భవిష్యత్ లో రూ.2 లక్షలకు చేరుకుంటుందని కొందరు అంటున్నారు. 2025 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు రూ.30 వేలకు పైగా పెరిగింది. ఇదే స్థాయిలో పరిస్థితి ఉంటే రూ.2 లక్షలకు వరకు అయినా వెళ్లే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది పెట్టుబడిదారులు బంగార కొనడానికి ఆసక్తి చూపుతున్నారు.