Balakrishna 9 Number Trolls: నేటి రాజకీయాలు సోషల్ మీడియా ఆధారంగా సాగుతున్నాయి. రాజకీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు తగ్గట్టుగా సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియోలు సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో నవ్వులు పుట్టిస్తోంది. అది ఏపీలో రాజకీయ పరిణామాలకు అద్దం పడుతోంది.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శాసనసభలో తీవ్రమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. అప్పట్లో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనను సినీ నటులు కలిశారు. ఆ సమయంలో ఆయన అవమానించారని ఇటీవల బాలకృష్ణ వ్యాఖ్యానించారు. నాడు జగన్ ను కలిసిన సినీ నటుల జాబితాలో తన పేరును 9వ నెంబర్ లో చేర్చారని బాలకృష్ణ ఆరోపించారు. పైగా కామినేని శ్రీనివాస్ పై బాలకృష్ణ మండిపడ్డారు. కామినేని శ్రీనివాస్, బాలకృష్ణ వ్యాఖ్యలను స్పీకర్ రికార్డుల నుంచి తొలగించారు.
ఈ వివాదం ముగిసిన తర్వాత కూడా ఇప్పటికి సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంది. కొంతమంది బాలకృష్ణ పేరు ప్రస్తావించకుండా.. 9 నెంబర్ పేరును పదేపదే ఉటంకిస్తూ సోషల్ మీడియాలో వీడియోలను రూపొందిస్తున్నారు. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ కనిపిస్తోంది.. ఆ వీడియోలో కొంతమంది వ్యక్తులు ఓ ప్రాంతానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందులో ఓ వ్యక్తి పర్యటనకు రాను అని చెప్పాడు. ఎందుకని మిగతా స్నేహితులు వాకబు చేస్తే.. తన పేరు 9వ స్థానంలో నమోదు చేశారని.. అందువల్ల తాను హర్ట్ అయ్యాయని పేర్కొన్నాడు. ఇటీవల బాలకృష్ణ 9వ నెంబర్ ను శాసనసభలో ప్రధానంగా ప్రస్తావించడం విశేషం. దానినే ఉటంకిస్తూ ఆ వ్యక్తి కూడా చెప్పడం నవ్వులు తెప్పిస్తోంది. అయితే వారంతా కూడా వైసిపి అనుకూల వ్యక్తులని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు.
Hilarious….. NO 9 https://t.co/2X9KPSj7wX
— Dr.Pradeep Reddy Chinta (@DrPradeepChinta) September 29, 2025