Gold Price Today: బంగారం ధరలు మరోసారి పడిపోయాయి. దీంతో కొనుగోలుదారుల్లో సంతోషం వ్యక్తం అవుతుండగా.. పెట్టుబడిదారులు మాత్రం షాక్ కు గురయ్యారు. కొన్ని రోజుల కిందట లక్ష రూపాయల మార్క్ చేసిన బంగారం ధరలు ఆ తరువాత రెండు రోజులగా భారీగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే ఈ బంగారం ధరలు తగ్గడానికికారణమేంటి? బంగారం ధరలు ఎక్కడెక్కడ.. ఎలా ఉన్నాయి?
బులియన్ మార్కెట్ ప్రకారం.. మే 2న న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,750గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.95, 510గా ఉంది. మే 1న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.87,770తో విక్రయించారు. 10 గ్రాముల బంగారం ధర గురువారంతో పోలిస్తే శుక్రవారం రూ.200వరకు తగ్గింది. అయితే వరుసగా రెండు రోజుల పాటు బంగారం ధరలు తగ్గడంపై చర్చ సాగుతోంది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగారల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
Also Read : తగ్గిన బంగారం ధరలు.. పడిపోవడానికి కారణం ఇదే..
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,770 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.95,660గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.87,550 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.95,550 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.87,550 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.95,550తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.87,550 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.95,550తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.87,550తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.95,550తో విక్రయిస్తున్నారు.
బంగారం ధరలు తగ్గుతున్నా.. వెండి ధరలు మాత్రం స్థారంగానే కొనసాగాయి. శుక్రవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.98,000గా నమోదైంది. గురువారంతో పోలిస్తే శుక్రవారం ధరలో ఎటువంటి మార్పులు లేవు. దీంతో కొనుగోలుదారుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.98,000గా ఉంది. ముంబైలో రూ.98,000, చెన్నైలో రూ.1,09,000 బెంగుళూరులో 98,000, హైదరాబాద్ లో రూ. 98,000 తో విక్రయిస్తున్నారు.
అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులే బంగారం ధరలు పడిపోవడానికి కారణమని తెలుస్తోంది. కొన్ని దేశాల మధ్య కొత్త ఒప్పందాలు సాగుతుండడంతో బంగారంపై పెట్టుబడిపెట్టేవారి సంఖ్య తగ్గిపోతుంది. దీంతో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. మొన్నటి వరకు చాలా మంది బంగారంపై ఇన్వెస్ట్మెంట్ చేశారు. కానీ ఇప్పుడు పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడం లేదు.