Gold Price Today: బంగారం ధరలు కొన్ని రోజులుగా పెరిగినట్లే పెరిగి.. ఆ తరువాత మళ్లి తగ్గుతున్నాయి. గత వారం వరకు జెట్ స్పీడ్ లా దూసుకెళ్లిన బంగారం ధరలు ఆ తరువాత ఒక్కకసారిగా పతనమవుతున్నాయి. ఈ అక్షయ తృతీయ సందర్భంగా బంగారం ధరలు ఎక్కువగా ఉన్నా కొనుగోళ్లు మాత్రం పడపోలేదు. కానీ ఆ తరువాత బంగారం ధరలు తగ్గడంతో తీవ్ర చర్చ నీయాంశంగా మారింది. అయితే అంతర్జాతీయ పరిస్థితులే కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
బులియన్ మార్కెట్ ప్రకారం.. మే 1న న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,750గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.95, 730గా ఉంది. ఏప్రిల్ 30న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.89,750తో విక్రయించారు. 10 గ్రాముల బంగారం ధర బుధవారంతో పోలిస్తే గురువాం రూ.2 వేల రూపాయల వరకు తగ్గింది. దీంతో ఇంత స్థాయిలో బంగారం తగ్గడంపై చర్చనీయాంశంగా మారింది. దేశంలోని ప్రధాన నగారల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
Also Read : క్రెడిట్ కార్డు ద్వారా బంగారం కొంటున్నారా?
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,790 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.95,880గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.87,750 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.95,730 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.87,750 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.95,730తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.87,750 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.95,730తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.87,750తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.95,730తో విక్రయిస్తున్నారు.
బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి. గురువారం ఓవరాల్ గా కిలో వెండి రూ.98,000గా నమోదైంది. బుధవారంతో పోలిస్తే గురువారం రూ.1000 తగ్గింది. వెండి ధరలు తగ్గడంతో కొనుగోలుదారుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.98,000గా ఉంది. ముంబైలో రూ.98,000, చెన్నైలో రూ.1,07,000 బెంగుళూరులో 98,000, హైదరాబాద్ లో రూ. 1,07,000 తో విక్రయిస్తున్నారు.
అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులే బంగారం ధరలు పడిపోవడానికి కారణమని తెలుస్తోంది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందాలు మెరుగుపడుతున్నాయనడంతో డాలర్ విలువ బలపడింది. దీంతో పసిడికి ఉన్న డిమాండ్ తగ్గింది. దీంతో ఆసియా మార్కెట్ లో బంగారం ధరలు తగ్గినట్లు తెలుస్తోంది. అయితే దేశీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గడంతో కొనుగోలుదారుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం శుభకార్యాల సీజన్ కావడంతో చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో బంగారం ధరలు తగ్గడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.