Gold Price Today: బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తూ ఉన్న బంగారం ధరలు మరోసారి పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పెళ్లిలో సీజన్ కావడంతో చాలామంది బంగారం కొనుగోలు చేస్తున్నారు. ఈ సమయంలో బంగారం ధరలు పెరగడంతో ఒక్కసారిగా షాక్ తిన్నారు. అయితే బంగారం పై ఇన్వెస్ట్మెంట్ చేసిన వారు మాత్రం భారీగా లాభపడ్డారు. ఈ క్రమంలో బంగారం ధరలు ఈరోజు ఎలా ఉన్నాయంటే?
Also Read : బంగారం ధరలు.. వారం రోజుల్లో రూ.8,000 తగ్గింపు.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే?
బులియన్ మార్కెట్ ప్రకారం.. మే 21న న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,300గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.97,410గా ఉంది. మే 20న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.87,100తో విక్రయించారు. 10 గ్రాముల బంగారం ధర మంగళవారంతో పోలిస్తే బుధవారం రూ.2,200 పెరిగింది. అటు 24 క్యారెట్ల బంగారం పై రూ.2,400 పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,450 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.97,570గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.89,300 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.97,420 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.89,300 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.97,420తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.89,300 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.97,420తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.89,300తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.97,420తో విక్రయిస్తున్నారు.
బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. బుధవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.1,11,000గా నమోదైంది. మంగళవారంతో పోలిస్తే బుధవారం రూ.3000 పెరిగింది. బంగారంతో పాటు వెండి ధరలు పెరగడంతో శుభకార్యాలు నిర్వహించుకునేవారు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ పెరుగుదల ఇలాగే కొనసాగుతుందా లేదా చూడాల్సి ఉంది. ప్రస్తుతం న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.1,00,000గా ఉంది. ముంబైలో రూ.1,00,,000, చెన్నైలో రూ.1,11,000 బెంగుళూరులో 1,00,000, హైదరాబాద్ లో రూ. 1,11,000 తో విక్రయిస్తున్నారు.
అంతర్జాతీయ మార్పులతో పాటు దేశంలో బంగారానికి డిమాండ్ పెరగడంతో కొనుగోలు పెరిగాయి. దీంతో ధరలు పెరిగినట్లు తెలుస్తోంది . అటు పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.