Gold Price Today India: మొన్నటి వరకు 10 గ్రాముల బంగారం ధర రూ. లక్షకు పైగా కొనసాగింది. జూలై 22 మంగళవారం నమోదైన ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01440కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 92,850గా ఉంది. అయితే బుధవారం నుంచి బంగారం ధర తగ్గుతూ వచ్చింది. మూడు రోజుల్లో బంగారం ధర రూ. 2400 తగ్గి లక్ష రూపాయల దిగువకు వచ్చింది. దీంతో బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం అని నిపుణులు అంటున్నారు. మరి ఈరోజు దేశ వ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
బులియన్ మార్కెట్ ప్రకారం శనివారం దేశవ్యాప్తంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,600 గా నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 99,930 పలుకుతోంది. న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 91,750 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,0080గా నమోదైంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 91,600 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,930గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 91,600 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,930గా నమోదైంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 91,600 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,930గా నమోదైంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 91,600 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,930గా నమోదైంది.
వెండి ధరలు సైతం బంగారంతో పాటు దిగి వస్తున్నాయి. జూలై 22న వెండి కిలో ధర రూ. 1,28000 గా నమోదైంది. కానీ శనివారం కిలో వెండి రూ. 1,26,000గా నమోదైంది. అంటే మూడు రోజుల్లో రూ.2,000 తగ్గింది. దీంతో వెండి కొనేవారి సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో బంగారంతో పాటు వెండికి కూడా డిమాండ్ ఉంటుంది.
మరోవపు శ్రావణమాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ఇళ్లల్లో వ్రతాలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో బంగారం ధరలు శుభవార్తను అందిస్తున్నాయి. మొన్నటి వరకు లక్షకు పైగా ఎగబాకిన బంగారం ధరలు వరుసగా కుప్పు కూలుతున్నాయి. శ్రావణమాసంలో ఉపవాసం ఉండే భక్తులకు ఇది మంచి సమయం అనుకోవచ్చు. ఎందుకంటే ఈ మాసంలో కొందరు శుభకార్యాల కోసం బంగారం కొనుగోలు చేస్తుంటారు. వివాహాలకు సైతం బంగారం కొనుగోలు చేసేవారు ఉన్నారు. అయితే వెంటనే బంగారం కొనేయాలని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే మళ్లీ పెరిగే అవకాశం ఉందని తెలుపుతున్నారు.