Gold Prices: బంగారం, వెండి కొనేవాళ్లకు భారీ షాక్.. ఊహించని స్థాయిలో పెరిగిన ధరలు!

Gold Prices: రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. గత కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉండగా ప్రస్తుతం బంగారం, వెండి ధరలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. పరిస్థితులలో మార్పు రాకపోతే మరికొన్ని రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మెరుపు వేగంతో బంగారం ధరలు పెరుగుతుండటం గమనార్హం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు కూడా పెరుగుతాయని […]

Written By: Navya, Updated On : March 6, 2022 9:00 am
Follow us on

Gold Prices: రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. గత కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉండగా ప్రస్తుతం బంగారం, వెండి ధరలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. పరిస్థితులలో మార్పు రాకపోతే మరికొన్ని రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మెరుపు వేగంతో బంగారం ధరలు పెరుగుతుండటం గమనార్హం.

రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు కూడా పెరుగుతాయని సమాచారం అందుతోంది. ఈ నెల 7వ తేదీ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు కనీవిని ఎరుగని స్థాయిలో పెరిగే ఛాన్స్ ఉందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. బంగారం ధర ఏకంగా 700 రూపాయల నుంచి 760 రూపాయల వరకు పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర 47,700 రూపాయల నుంచి ఏకంగా 48,400 రూపాయలకు పెరిగింది.

24 క్యారెట్ల బంగారం ధరలను పరిశీలిస్తే బంగారం ధర 52,040 రూపాయల నుంచి 52800 రూపాయల వరకు పెరగడం గమనార్హం. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లలో ఈ రేట్లు అమలవుతున్నాయి. చెన్నైలో బంగారం ధరలు ఇతర ఏరియాలతో పోలిస్తే మరింత ఎక్కువగా ఉండటం గమనార్హం. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా అంతకంతకూ పెరగడం గమనార్హం.

వెండి ధరలు ఏకంగా 2,000 రూపాయలు పెరిగాయి. కిలో వెండి ధర 68,000 రూపాయల నుంచి 70,000 రూపాయలకు పెరగడం గమనార్హం. బంగారం, వెండి ఊహించని స్థాయిలో పెరుగుతుండటంతో ప్రస్తుతం కొనే పరిస్థితులు లేవని బంగారం, వెండి కొనుగోలుదారులు కామెంట్లు చేస్తున్నారు.