Gold And Silver Prices: తెలుగు రాష్ట్రాలలో బంగారం, వెండి ధరలివే.. ఎంత ఉన్నాయంటే?

Gold And Silver Prices: రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో పాటు బంగారం, వెండి ధరలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. గత కొన్ని నెలలుగా 10 గ్రాముల బంగారం ధర 50,000 రూపాయలకే పరిమితం కాగా యుద్ధం వల్ల ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అయితే ఈరోజు బంగారం, వెండి ధరలను పరిశీలిస్తే బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర […]

Written By: Navya, Updated On : March 7, 2022 9:24 am
Follow us on

Gold And Silver Prices: రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో పాటు బంగారం, వెండి ధరలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. గత కొన్ని నెలలుగా 10 గ్రాముల బంగారం ధర 50,000 రూపాయలకే పరిమితం కాగా యుద్ధం వల్ల ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అయితే ఈరోజు బంగారం, వెండి ధరలను పరిశీలిస్తే బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 48,400 రూపాయలుగా ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 52,800 రూపాయలుగా ఉండటం గమనార్హం. దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర 70,000 రూపాయలుగా ఉండటం గమనార్హం. అయితే బంగారం, వెండి కొనుగోలు చేసేవాళ్లు వెంటనే కొనుగోలు చేస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే 10 గ్రాముల బంగారం ధర 60,000 రూపాయలకు చేరే అవకాశం ఉంది.

అయితే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం ఆగిపోయి సాధారణ పరిస్థితులు ఏర్పడితే మాత్రం బంగారం, వెండి ధరలు సాధారణ స్థితికి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. పెళ్లి కోసం బంగారం కొనుగోలు చేసేవాళ్లపై పెరుగుతున్న బంగారం ధరలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలపై పెరుగుతున్న బంగారం ధరలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

బంగారం, వెండి ధరలు తగ్గితే బాగుంటుందని ప్రజలు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు పెరుగుతుండటంతో దేశీయ మార్కెట్ లో కూడా బంగారం, వెండి ధరలలో పెరుగుదల చోటు చేసుకుంటూ ఉండటం గమనార్హం.