https://oktelugu.com/

రూ.500 నోటుకు రూ.10 వేలు పొందే అవకాశం.. ఎలా అంటే..?

మనలో చాలామంది పాత నాణేలను, పాత నోట్లను దాచుకుంటూ ఉంటారు. అయితే పాత నోట్లు, పాత నాణేలను కలిగి ఉన్నవాళ్లు సులభంగా డబ్బులు సంపాదించే అవకాశం ఉంది. తక్కువ సమయంలోనే డబ్బులు సంపాదించాలని భావించే వాళ్లు పాత 500 రూపాయల నోటును కలిగి ఉంటే ఏకంగా 10,000 రూపాయలు పొందే అవకాశం ఉంది. ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేకుండానే ఈ డబ్బును పొందవచ్చు. అయితే పాత నోట్లు ఉన్న ప్రతిఒక్కరూ 10,000 రూపాయలు పొందడం సాధ్యం కాదు. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : June 9, 2021 / 06:22 PM IST
    Follow us on

    మనలో చాలామంది పాత నాణేలను, పాత నోట్లను దాచుకుంటూ ఉంటారు. అయితే పాత నోట్లు, పాత నాణేలను కలిగి ఉన్నవాళ్లు సులభంగా డబ్బులు సంపాదించే అవకాశం ఉంది. తక్కువ సమయంలోనే డబ్బులు సంపాదించాలని భావించే వాళ్లు పాత 500 రూపాయల నోటును కలిగి ఉంటే ఏకంగా 10,000 రూపాయలు పొందే అవకాశం ఉంది. ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేకుండానే ఈ డబ్బును పొందవచ్చు.

    అయితే పాత నోట్లు ఉన్న ప్రతిఒక్కరూ 10,000 రూపాయలు పొందడం సాధ్యం కాదు. కరెన్సీ నోట్లను ముద్రించే సమయంలో ఆర్బీఐ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుందనే సంగతి తెలిసిందే. సీరియల్ నంబర్లతో పాటు ఇతర విషయాల్లో ఏదైనా చిన్న పొరపాటు జరిగితే మార్కెట్ లోకి వచ్చే ఆ నోట్లు స్పెషల్ నోట్లు అవుతాయి. ఆ స్పెషల్ నోట్లను కొనుగోలు చేయడానికి చాలామంది ఆసక్తి చూపుతుంటారు.

    మీ దగ్గర ఉన్న పాత కరెన్సీ నోటుపై సీరియల్ నంబర్ రెండు సార్లు ప్రింట్ అయ్యి ఉంటే మాత్రం ఏకంగా 5,000 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. పాత 500 రూపాయల నోటుపై ఒకవైపు అంచు ఎక్కువగా ఉండి మరోవైపు అంచు తక్కువగా ఉంటే మాత్రం ఏకంగా 10,000 రూపాయల వరకు పొందే అవకాశాలు అయితే ఉంటాయి. oldindiancoins.com వెబ్ సైట్ లో రిజిష్టర్ చేసుకోవడం ద్వారా ఈ మొత్తం పొందవచ్చు.

    ఎవరైతే సెల్లర్ గా రిజిష్టర్ చేసుకుంటారో వాళ్లు తమ దగ్గర ఉన్న నాణేలు, నోట్లను ఫోటో తీసి అమ్మకానికి ఉంచవచ్చు. ఎవరైనా ఆ నోటును కొనుగోలు చేయాలని భావిస్తారో వారికి ఆ నోటును సులభంగా విక్రయించవచ్చు.