
తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గిన ప్రాంతాలన్నింటిలో పగటి పూట లాక్ డౌన్ ను సర్కారు ఎత్తివేసిన నేపథ్యంలో బస్సు సర్వీసుల వేళలను టీఎస్ ఆర్టీసీ పొడిగించింది. సడలింపులకు అనుగుణంగా 10వ తేదీ నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జిల్లాలకు నడిపే బస్సులను తిప్పనున్నట్లు ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ యాదగిరి వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3,600 బస్సులను మధ్యాహ్నం 2 గంటల వరకు నడుపుతున్నామని వాటినే సాయంత్రం 6 గంటల వరకు తిప్పుతామని స్పష్టం చేశారు.