Free Electricity: ఇలా చేస్తే 300 యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీ..

కనీసం 300 యూనిట్ల వరకు కోటి ఇళ్లకు ఉచితంగా ఇవ్వడానికి కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని నరేంద్ర మోదీ జనవరిలో ప్రారంభించారు.

Written By: Chai Muchhata, Updated On : February 23, 2024 11:50 am

Free Electricity

Follow us on

Free Electricity: విద్యుత్ వినియోగం రోజురోజుకు పెరిగి పోతుంది.కొన్నిఅవసరాల కోసం విద్యుత్ పరికరాలు ఎక్కువగా వాడడం వల్ల ఇళ్లల్లో విద్యుత్ బిల్లులు తడిచిమోపడవుతున్నాయి. అయితే విద్యుత్ వినియోగం పెరిగినా బిల్లులు తగ్గించుకునే ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తుంది. కనీసం 300 యూనిట్ల వరకు కోటి ఇళ్లకు ఉచితంగా ఇవ్వడానికి కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని నరేంద్ర మోదీ జనవరిలో ప్రారంభించారు. ప్రతి ఇంటిపై సోలార్ పలకలను ఏర్పాటు చేసి విద్యుత్ ను అందించనున్నారు. అయితే వీటితో విద్యుత్ బిల్లులు తగ్గడమే కాకుండా అదనపు ఆదాయం కూడా వస్తుంది.. అదెలాగో తెలుసుకుందాం..

కేంద్ర ప్రభుత్వం ‘సూర్యోదయ యోజన’అనే పథకం ను ప్రవేశపెట్టింది. దీనిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 22న ప్రారంభించారు. ఈ పథకం ప్రకారం 300 యూనిట్ల విద్యుత్ ను ఉచితంగా ఇవ్వనున్నారు. దేశ వ్యాప్తంగా కోటి ఇళ్లపై రూప్ టాప్ సోలార్ ను ఏర్పాటుచేయనున్నారు. ఇదే విషయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ సమావేశాల్లో ప్రకటించారు. అయితే ఈ స్కీం పొందాలంటే ఏడాదికి రూ.1,50,000 కంటే తక్కువ ఆదాయం ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉన్న వారికి కూడా మరో స్కీం ఉంది.

అయితే ఈ పథకం ప్రకారం 300 యూనిట్ల వరకు కోట ఇళ్లకు ఉచితంగా విద్యుత్ ను ఇవ్వనున్నారు. ఒకవేళ 100 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ ను వినియోగిస్తే ఎక్సెస్ యూనిట్స్ గ్రిడ్ లోకి వెళుతాయి. అయితే ఎన్ని యూనిట్ల వరకు గ్రిడ్ లోకి వెళ్లాయో వాటికి సంబంధించిన డబ్బులను కేంద్రం ఇవ్వనుంది. ఇలా ఉచితంగా విద్యుత్ ను ఉపయోగించుకోవడంతో పాటు అదనంగా ఆదాయం కూడా పొందే అవకాశం ఉంది.

ఇందు కోసం ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డులనుసమీప విద్యుత్ కార్యాలయంలో ఇవ్వడం ద్వారా వారే వచ్చి రూప్ టాప్ సోలార్ ను ఏర్పాటు చేస్తారు. దీంతో ఉచితంగా విద్యుత్ ను పొందేఅవకాశం ఉంది. నేటి కాలంలో విద్యుత్ వినియోగం పెరగడంతో బిల్లులు భయపెడుతున్నాయి. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘సూర్యోదయ యోజన’ పథకంను ఉపయోగించుకోవడం వల్ల ఫ్రీగా విద్యుత్ ను పొందవచ్చు.