https://oktelugu.com/

Sundaram Master Movie Review: సుందరం మాస్టర్ మూవీ రివ్యూ…

వైవా హర్ష హీరోగా చేసిన 'సుందరం మాస్టారు' సినిమా ఈరోజు రిలీజ్ అయింది. మరి ఈ సినిమాతో హీరోగా చేసిన ఆయన తన మొదటి ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడా లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

Written By:
  • Gopi
  • , Updated On : February 23, 2024 / 11:30 AM IST
    Follow us on

    Sundaram Master Movie Review: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కమెడియన్స్ అందరూ హీరోలుగా మారుతూ వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొన్నటికి మొన్న సత్యం రాజేష్ పొలిమేర సినిమాతో హీరోగా మారి మంచి సక్సెస్ ని సాధించాడు. ఇకదానితో పొలిమేర 2 సినిమా కూడా తీసి విమర్శకుల నుంచి ప్రశంశలను అందుకున్నాడు. ఇక ఇప్పుడు వైవా హర్ష కూడా సినిమా హీరోగా మారి ‘సుందరం మాస్టారు’ అనే సినిమా తీశాడు. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ నుంచి మొదలైన ఆయన ప్రస్థానం చాలా సినిమాల్లో కమెడియన్ గా, హీరో ఫ్రెండ్ గా పాత్రలను పోషిస్తూ ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ వచ్చాడు. ఇక ఇప్పుడు ఆయన హీరోగా చేసిన ‘సుందరం మాస్టారు’ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. మరి ఈ సినిమాతో హీరోగా చేసిన ఆయన తన మొదటి ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడా లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    కథ

    ముందుగా ఈ కథ విషయానికి వస్తే సుందరం మాస్టారు అనే ఒక వ్యక్తి గవర్నమెంట్ స్కూల్లో సోషల్ టీచర్ గా పని చేస్తాడు. ఆయనకి డబ్బులుంటే చాలా ఇష్టం ఉంటుంది. గవర్నమెంట్ టీచర్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు తను పెళ్లి చేసుకుంటే తనకి ఎక్కువ కట్నం వస్తుందని ఆశపడతాడు. ఇక ఇదే టైం లో ఆ ఏరియాలో ఉన్న లోకల్ ఎమ్మెల్యే ఒకరోజు స్కూల్ కి వచ్చి అక్కడున్న టీచర్లందరినీ పరీక్షిస్తాడు. అందులో సుందరం మాస్టారు టాలెంట్ ని గుర్తించిన ఆయన తనకి ఒక పనిని అప్పజెప్తాడు. అది ఏంటి అంటే మిరియాల మెట్ట అనే ఒక ఊరు ఉంది. అది దాదాపు 90 సంవత్సరాలు నుంచి ప్రపంచంతో సంబంధం లేకుండా అక్కడ మనుషులు బతుకుతున్నారు. ఇప్పటివరకు వాళ్ళు ఎవ్వరిని ఏ హెల్ప్ అడగలేదు మొదటిసారిగా ఎమ్మెల్యే అయిన నన్ను వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించడానికి ఒక మాస్టర్ కావాలని ఉత్తరం రాశారు. ఇప్పుడు నువ్వు వెళ్లి వాళ్లకు ఇంగ్లీష్ మాస్టర్ గా పనిచేయాలి అని చెప్తాడు. ఇక వాళ్ళు అన్ని సంవత్సరాల నుంచి అక్కడే నివసిస్తున్నారు అంటే అక్కడ విలువైనది ఏదో ఉంది, అదేంటో తెలుసుకొని ఆరు నెలల్లో గనక నువ్వు తిరిగి వస్తే నీకు DEO గా పోస్ట్ ఇప్పిస్తాను అని చెప్పడంతో సుందరం మాస్టర్ టెంప్ట్ అవుతాడు. గవర్నమెంట్ టీచర్ కంటే DEO పెద్ద పోస్ట్ కాబట్టి DEO అయిన తర్వాత పెళ్లి చేసుకుంటే కట్నం ఎక్కువగా వస్తుంది అని ఆశపడి మిరియాల మెట్ట ఊరికి బయలు దేరుతాడు.

    ఇక అక్కడ ఉన్న జనాలు ఇంగ్లీష్ మాట్లాడడం చూసి సుందరం మాస్టర్ ఆశ్చర్యపోతాడు. సుందరం మాస్టారు మాట్లాడే ఇంగ్లీష్ సరైన ఇంగ్లీష్ కాదని వాళ్లు గొడవకు దిగుతారు… ఇక వాళ్ళు సుందరం మాస్టారు తో నీకు ఇంగ్లీష్ రాదని మకు తెలుసు నీకు ఒక 15 రోజులు టైం ఇస్తున్నాం. నువ్వు ఇంగ్లీష్ మొత్తం నేర్చుకొవాలి అప్పుడు నీకు ఒక ఎగ్జామ్ పెడతాం. అందులో నువ్వు పాస్ అయితే ఇంగ్లీష్ మాస్టర్ గా ఇక్కడ పనిచేస్తావు. లేకపోతే నిన్ను ఉరివేసి చంపేస్తాం అని ఆ ఊరి పెద్ద చెబుతాడు. దాంతో సుందరం మాస్టర్ అనవసరంగా ఇక్కడ ఇరుక్కుపోయానే అని భాద పడుతూ ఉంటాడు. అయితే అక్కడ ఉన్న ఓజా అనే వ్యక్తి సుందరం మాస్టర్ కి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇక వాళ్ల ఊరు చరిత్ర గురించి చెబుతూ 1920 వ సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు మా దగ్గరికి వచ్చి మా మిరియాల కోసం మమ్మల్ని బానిసలుగా చేసుకున్నారు. ఇక అప్పుడే ఒక దొర వచ్చి ఆ బ్రిటిష్ వాళ్ళని పంపించి ఆయన ఇక్కడే సెటిలై మాకు ఇంగ్లీషు నేర్పించాడు. అతని కొడుకు మాకు కొన్ని ఇంగ్లీష్ పదాలను నేర్పించడంతో మేము మాట్లాడడం కూడా నేర్చుకున్నాం. కాకపోతే ఆయన చనిపోవడంతో మాకు ఇంగ్లీష్ మాస్టర్ కావాల్సి వచ్చింది.

    దానికోసమే మేము ఇంగ్లీష్ మాస్టర్ కావాలని ఉత్తరం రాసాము అని చెబుతాడు. ఇక ఈ ఊరు గురించి మొత్తం తెలుసుకున్న సుందరం మాస్టారు ఓజా సహాయంతో వాళ్ళు పెట్టిన ఎగ్జామ్ పాస్ అవుతాడు. ఇక వాళ్లకు ఇంగ్లీష్ మాస్టర్ గా సెట్ అవుతాడు. ఇక ఇది ఇలా ఉంటే ఇక్కడ ఏదో విలువైనది ఉంది అని మాస్టారు దాన్ని వెతుకుతుంటే అతనికి గ్రామదేవత విగ్రహమే ఇక్కడ అత్యంత విలువైనదని తెలుస్తుంది. దాంతో ఆ గ్రామ దేవత విగ్రహం దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడ విగ్రహం ఉండదు. అసలు విగ్రహానికి ఏమైంది? సుందర మాస్టర్ వాళ్లకి ఇంగ్లీష్ పూర్తిగా నేర్పించాడా? అక్కడ నుంచి సుందర మాస్టర్ ఎలా బయటపడ్డాడు అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

    విశ్లేషణ
    ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికొస్తే సినిమా దర్శకుడు అయిన కళ్యాణ్ సంతోష్ మొదటి నుంచి చివరి వరకు ఈసినిమాను చాలా ఎంగేజింగ్ గా తీసుకెళ్లాడు. ముఖ్యంగా ఆయన రాసుకున్న కొన్ని సీన్లు అయితే నవ్వులు పూయించాయనే చెప్పాలి. మిరియాల మెట్ట అనే ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళు, ప్రపంచం ఎలా ఉంది అనే విషయాన్ని కూడా తెలియకుండా బతుకుతూ ఉంటారు. నిజానికి వాళ్ళకి కరెన్సీ నోటు ఎలా ఉంటుందో కూడా తెలియదు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్న విషయం కూడా తెలియదు, మన జాతిపిత గాంధీజీ అనే విషయాలేవీ వాళ్ళకి తెలియకుండా బతుకుతూ ఉంటారు. ఇక వాటి గురించి సుందర మాస్టర్ చెప్పే సమయంలో వచ్చే కామెడీ అయితే చాలా బాగుంటుంది. ఈ స్టోరీలో లాజిక్కులను పక్కన పెడితే సినిమా అనేది ఆధ్యాంతం ఒక హిలేరియస్ మూడ్ లో వెళ్తుంది. ఇలాంటి సినిమాలను చేయాలంటే కొంచెం కష్టంతో కూడుకున్న పనే ఎందుకంటే దాదాపు రెండున్నర గంటలపాటు ప్రేక్షకుడిని కూర్చోబెట్టి ఎంటర్ టైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు, కానీ ఈ విషయంలో డైరెక్టర్ కళ్యాణ్ చాలా వరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇక వైవా హర్ష మిరియాల మెట్ట ఊర్లోకి ఎంటర్ అయిన తర్వాత నుంచి సినిమా నాన్ స్టాప్ గా ఎక్కడ బోర్ కొట్టకుండా నడుస్తూ ఉంటుంది. విగ్రహం గురించి ఒక చిన్న హై మూమెంట్ ఇచ్చి ఇంటర్వెల్ వేస్తాడు. ఇక సెకండ్ హాఫ్ అంత ఇంట్రెస్టింగా సాగుతూ ఉంటుంది.

    అలాగే సుందరం మాస్టారుకి డబ్బు ఒకటే ప్రపంచం కాదు. ఇక్కడ ఉండే ప్రకృతి గాని, ఇక్కడ ఉండే మనుషుల మధ్య కల్మషం లేని మనస్తత్వాలు గానీ ఎలా ఉంటాయి వాటిలో ఎంత స్వచ్ఛత ఉంటుంది అనే విషయాలను తెలియజేస్తూ సాగే ఎమోషనల్ టచ్ తో కూడిన సీన్లను కూడా చాలా బాగా ఎలివేట్ చేస్తూ డైరెక్టర్ రాసుకున్నాడు. అన్ని బాగానే ఉన్నప్పటికీ ఈ సినిమాలో కొన్ని సీన్లను వదిలేస్తే సినిమా మొత్తానికి ఒక మూడు క్రియేట్ చేయడంలో మాత్రం దర్శకుడు కొద్దిగా తడపడ్డాడు. ఆయనకు మొదటి సినిమా కాబట్టి ఆయన తడపడ్డట్టుగా చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంటుంది. అలాగే డైరెక్షన్ లో కూడా చాలా వరకు ఫ్లాస్ ఉన్నాయి…ఇక ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే కూడా ప్రేక్షకుల్లో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు…

    నటీనటుల పనితీరు…
    ఇక ఆర్టిస్టులు పర్ఫామెన్స్ విషయానికొస్తే వైవా హర్ష ఒక్కడే వన్ మ్యాన్ షో చేస్తూ ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లాడు. దర్శకుడు ఏ పాయింట్ అఫ్ వ్యూలో అయితే ఈ సినిమా కథని రాసుకున్నాడో అందులో కొంచెం కూడా డివియేట్ అవ్వకుండా సుందరం మాస్టర్ అనే క్యారెక్టర్ ని హర్ష పర్ఫెక్ట్ గా పొట్రే చేశాడనే చెప్పాలి. ఇక హీరోయిన్ అయిన దివ్య శ్రీపాద తన పాత్ర మేరకు పర్లేదు అనిపించింది. ఇక మిగతా సపోర్టింగ్ ఆర్టిస్టులందరూ కూడా ఓకే అనేలా చేశారు. కానీ మొత్తానికైతే వైవా హర్ష మాత్రం సుందరం మాస్టారు పాత్రలో నటించి మెప్పించడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు కనిపించిన హర్ష వేరు, ఈ సినిమాలో హర్ష వేరు. కొన్ని ఎమోషన్స్ సీన్స్ లో అయితే నెక్స్ట్ లెవల్ పర్ఫామెన్స్ ఇచ్చాడనే చెప్పాలి…

    టెక్నికల్ అంశాలు

    టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి దీపక్ అందించిన విజువల్స్ సూపర్ గా ఉన్నాయి. కొన్ని సీన్లలో ఎమోషన్ ని పండించడానికి ఆయన ఎంచుకున్న షాట్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. సీన్ మూడ్ ని చెడగొట్టకుండా అలాగే సినిమా చూసే ప్రేక్షకుడికి కొత్తగా అనిపించే విధంగా తను అందించిన విజువల్స్ సూపర్ గా ఉన్నాయి… ఇక శ్రీ చరణ్ మ్యూజిక్ బావుంది. కానీ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడంలో మాత్రం తన మ్యూజిక్ పూర్తి స్థాయిలో హెల్ప్ అవ్వలేదనే చెప్పాలి. ఇక మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఆర్ట్ డైరెక్టర్ చంద్రమౌళి గురించి మిరియాల మెట్ట అనే ఊరుని ఆయన సెట్స్ తో అద్భుతంగా డిజైన్ చేశాడు. ఈ సినిమా బాగా రావడానికి తన వంతు బాధ్యతని తను హండ్రెడ్ పర్సెంట్ పూర్తి ఎఫర్ట్ పెట్టీ చేశాడనే చెప్పాలి…ఇక ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వస్తే ఉన్నదాంట్లో బాగున్నాయి. రవితేజ మొదటి ప్రయత్నం లోనే ప్రేక్షకులకు ఒక మంచి సినిమాను అందించాడు.

    ప్లస్ పాయింట్స్

    వైవా హర్ష
    కథ
    కొన్ని సీన్లు

    మైనస్ పాయింట్స్

    మ్యూజిక్
    స్క్రీన్ ప్లే
    కొన్ని సీన్స్ లో డైరెక్షన్

    రేటింగ్
    ఈ సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ 2.75/5

    చివరి లైన్
    వైవా హర్ష యాక్టింగ్ కోసమైన ఒకసారి చూడవచ్చు…