Business Ideas: ఉద్యోగం రావడం లేదా? తక్కువ పెట్టుబడితో ఈజీ బిజినెస్.. త్వరపడండి..

వ్యాపారం అనగానే చాలా మంది పెద్దగా ఊహించుకుంటారు. కానీ బిజినెస్ మైండ్ ఉన్నవాళ్లు ఆలోచించేది డిమాండ్ వస్తువులపై. ఈరోజుల్లో ఫుడ్ బిజినెస్ తో అత్యధిక లాభాలు వస్తున్నాయి.

Written By: Chai Muchhata, Updated On : May 15, 2023 1:09 pm

Business Ideas

Follow us on

Business Ideas: ప్రపంచవ్యాప్తంగా మారుతన్న పరిణామాలతో ఈరోజుల్లో మంచి ఉద్యోగం రావడం కష్టమే. దీంతో చాలా మంది కాంప్రమైజ్ అయి ఏదో ఒక జాబ్ లో చేరిపోతున్నారు. తమకు ఇష్టం లేకున్నా.. బతుకు దెరువు కోసం పనిచేయాల్సి వస్తోంది. టాలెంట్, శ్రమను ఖర్చు చేసినా జీతం బెత్తెడే అన్న చందంలో ఆదాయం వస్తోంది.ఈ తరుణంలో చాలా మంది సొంతంగా బిజినెస్ పెట్టాలని అనుకుంటారు. కానీ పెట్టుబడి ని చూసి భయపడిపోతుంటారు. అయితే తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి చిన్న వ్యాపారాలను సాధించి అధిక లాభాలు పొందేవి చాలానే ఉన్నాయి. ఇలాంటి వాటిని ఏర్పాటు చేయాలంటే కేవలం పెట్టుబడి మాత్రమే కాదు. సరైన ప్లానింగ్ చొరవ ఉండాలి. ఇలాంటివాటిలో అద్భుతమైన కొన్ని వ్యాపారాల గురించి తెలుసుకుందాం.

వ్యాపారం అనగానే చాలా మంది పెద్దగా ఊహించుకుంటారు. కానీ బిజినెస్ మైండ్ ఉన్నవాళ్లు ఆలోచించేది డిమాండ్ వస్తువులపై. ఈరోజుల్లో ఫుడ్ బిజినెస్ తో అత్యధిక లాభాలు వస్తున్నాయి. ఒకప్పుడు వంట మాస్టర్ అంటే చీఫ్ గా చూసేవాళ్లు ఇప్పుడు చెప్ అంటే ప్రత్యేక గౌరవమిస్తున్నారు. విభిన్న రకాలతో రుచికరమైన వంటలు చేసేవారికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. కొన్ని స్టార్ హోటళ్లు ఫేమస్ కావడానికి చేయి తిరిగిన చెఫ్ ఉండడమే కారణమని గ్రహించాలి. అయితే చెఫ్ గా మారాలంటే అందుకు ప్రత్యేక మైన నైపుణ్యం ఉండాలి.

కానీ ఎలాంటి నైపుణ్యం లేకుండా.. తక్కువ మొత్తంలో పెట్టుబడితో ప్రారంభించే వ్యాపారల్లో కర్రీ పాయింట్ ఒకటి. ఇంట్లో ఒక్కోసారి ఆడవాళ్లు లేని సమయంలో, బ్యాచ్ లర్ బాబులకు ఒక్కసారి మీ కర్రీ పాయింట్ రుచి చూపిస్తే ప్రతీరోజూ వచ్చి తీసుకెళ్తారు. అన్నం వండడానికి పెద్దగా కష్టం ఉండదు. కానీ మంచి కర్రీని తయారు చేసుకోవాలంటే పెద్ద ప్రాసెస్ అవుతుంది. ఈ నేపథ్యంలో రుచికరమైన కర్రీని పరిచయం చేస్తే వాళ్లు ఇంట్లో కర్రీని తయారు చేసుకోకుండా మీ సెంటర్ కే క్యూ కడుతారు. ఇక కర్రీ అద్భుతంగా ఉందని భావిస్తే ఇంట్లో ఆడవాళ్లు ఉన్నా కర్రీని కొనుగోలు చేస్తుంటారు.

మెట్రో నగరాల్లో ప్రత్యేకమైన ఫుడ్ కోర్టులను చూస్టూ ఉంటాం. ఇందులో చాలా వరకు వెరైటీ వంటకాలు కనిపిస్తాయి. కస్టమర్లను ఆకర్షించడానికి ఉన్న వనరులను ఉపయోగించి కొత్త వంటకాలను తయారు చేయడం ద్వారా ఇంప్రెస్ అవుతారు. అలా మీ సెంటర్ కు ఫ్యాన్స్ గా మారిపోతుంటారు. ఉదాహరణకు ‘షోవర్ మా’ అనే చికెన్ వంటకానికి ఇప్పుడు డిమాండ్ బాగా ఉంది. కొన్ని రోజుల పాటు ఇది నగరాల్లో మాత్రమే కనిపించేది. ఇప్పుడు పట్టణాల్లో కూడా లభ్యమవుతుంంది. ఇలాంటి ప్రత్యేకమైన ఫుడ్ లను అందిచడం వల్ల వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేసుకోవచ్చు.

వెజ్ కంటే నాన్ వెజ్ ప్రియులు ఎక్కువే ఉంటారు. నాన్ వెజ్ లో విభిన్న రకాల వంటకాలను తయారు చేయొచ్చు. ఇలా తక్కువ పెట్టుబడిలో ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేయడం ద్వారా భోజన ప్రియులు లైక్ చేస్తారు. ఒక్కసారి రుచి తెలిస్తే మరోసారి వాళ్లు రాకుండా ఉండరు. ఇలా ఫుడ్ బిజినెస్ ను తక్కువ పెట్టుబడితో ప్రారంభించి అధిక లాభాలు పొందే అవకాశం ఉంటుంది. వీటిని స్ఠాపించడానికి పెద్దగా లోకేషన్ కూడా అవసరం లేదు. అయితే రుచి చూపించడానికి కొన్ని రోజులు పాటు తక్కువ ప్రైస్ కేటాయిస్తే వినియోగదారులు ఇంప్రెస్ అవుతారు. ఆ తరువాత రేట్లు పెంచినా రుచి కోసం క్యూ కడుతారు.