https://oktelugu.com/

Sunil Kanugulu : పీకే పోయి.. తెరపైకి సునీల్ కొనుగోలు.. తెలంగాణలో దబిడదిబిడే

కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుతో ఓ కొత్త స్ట్రాటజిస్టు తెరపైకి వచ్చారు. ఆయనే సునీల్ కొనుగోలు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కు ఆయన సేవలందిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సభ్యుడు కూడా.

Written By:
  • Dharma
  • , Updated On : May 15, 2023 / 01:08 PM IST
    Follow us on

    Sunil Kanugulu : దేశంలో ఎన్నికల వ్యూహకర్త అంటే ముందుగా గుర్తొచ్చేది ప్రశాంత్ కిశోర్. గత పదేళ్లుగా ఆయన చాలా పార్టీలకు స్ట్రాటజిస్టుగా పనిచేశారు. చాలా పీఠాలను కదిలించారు. చాలామందిని అధికార పీఠమెక్కించారు. అయితే ఆయన స్ట్రాటజిస్టు నుంచి పొలిటీషియన్ గా అవతారమెత్తారు. రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కానీ వ్యూహ కర్త వాసనల నుంచి మాత్రం పోలేదు. ఆయన టీమ్ వివిధ రాష్ట్రాల్లో సేవలందిస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాలకు పీకే టిమ్ లే సేవలందిస్తున్నాయి. వ్యూహ ప్రతివ్యూహాలు రూపొందిస్తున్నాయి. కానీ గతంలో మాదిరిగా పీకే వ్యూహాలేవీ వర్కవుట్ కావడం లేదు. ఆయనిస్తున్న స్లోగన్స్ మరీ పేలవంగా ఉంటున్నాయి. రోత పుట్టిస్తున్నాయి. అందుకే అప్ డేటెడ్ స్ట్రాటజిస్టులు తెరపైకి వస్తున్నారు.

    కర్నాటకలో బ్లాక్ బస్టర్ …
    కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుతో ఓ కొత్త స్ట్రాటజిస్టు తెరపైకి వచ్చారు. ఆయనే సునీల్ కొనుగోలు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కు ఆయన సేవలందిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సభ్యుడు కూడా. అందుకే అంకిత భావంతో సేవలు అందించడం ప్రారంభించారు. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీకి బ్లాక్ బాస్టర్ హిట్ ను అందించారు. ఆయన స్లోగన్స్ గన్స్ లా పేలాయి. ఆయన వ్యూహాలు ప్రత్యర్ధులకు మైండ్ బ్లాంక్ అయ్యేలా చేశాయి. చివరికి అదిరిపోయే విజయం కాంగ్రెస్ ఖాతాలో పడింది. సునీల్ కనుగోలు ఒక  సామన్యుడిగా ఉంటారు. ఆయన లో ప్రొఫైల్ మెయింటెయిన్ చేస్తారు. ఎక్కడా ఆయన్ ఫోటో కనిపించదు. ఎక్కడా ఆయన మాట వినిపించదు. కర్నాటకలో ఇదే వర్కవుట్ అయ్యింది.

    ఇక తెలంగాణలో..
    సునీల్ కొనుగోలు నెక్ట్స్ తెలంగాణపై కాన్సంట్రేట్ చేశారు. హైదరాబాద్ లో కార్యాలయం తెరిచి సేవలందిస్తున్నారు. సైలెంట్ గా పనిచేసుకుంటూ పోతున్నారు. కర్నాటకలో ఒకే ఒక స్లోగన్ తో ఆకట్టుకున్నారు. 40 ఫర్సంటేజ్ గవర్నమెంట్ అంటూ బీజేపీ పై బాణం వదిలారు. బీజేపీకి మైండ్ బ్లాక్ అయ్యేలా చేశారు. ఆ ఆరోపణ నుంచి బయటపడలేక బీజేపీ భారీ మూల్యం చెల్లించుకుంది. అయితే సునీల్ ఇప్పుడు తెలంగాణలో ఆపరేషన్స్ ప్రారంభించడంతో బీఆర్ఎస్ కలవరపాటుకు గురవుతోంది. మొన్న ఆ మధ్యన హైదరాబాద్ లోని ఆయన కార్యాలయంపై తెలంగాణ పోలీసులు దాడిచేశారు. కంప్యూటర్లను ఎత్తుకుపోయారు. కర్నాటక ఎన్నికల సమాచారం బీఆర్ఎస్ ద్వారా బీజేపీకి చేరిందని వార్తలు వచ్చాయి. కానీ కొత్త ఎత్తుగడలతో సునీల్ కర్నాటకలో ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి మంచి విజయాన్ని అందించారు.

    పీకేతో వార్
    అయితే ఇప్పుడు తెలంగాణలో సునీల్ అడుగుపెట్టారు. వ్యూహాలను పదును పెడుతున్నారు. దీంతో ఎటువంటి స్లోగన్స్ వస్తాయోని బీఆర్ఎస్ ఎదురుచూస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ కు ప్రశాంత్ కిశోర్ వ్యూహకర్తగా ఉన్నారు. దీంతో సునీల్ కొనుగోలు వర్సెస్ పీకే అన్నట్టు యుద్ధం జరగనుంది. అయితే సునీల్ అటు బీజేపీకి, ఇటు బీఆర్ఎస్ మైండ్ బ్లాక్ అయ్యే స్లోగన్స్ తెరమీదకు తేనున్నట్టు తెలుస్తోంది. దానికి విరుగుడు చర్యలుగా పీకే ఎలా వ్యవహరిస్తారో తెలియాల్సి ఉంది. ఆరు నెలల పాటు తెలంగాణ పాలిటిక్స్ ను ఈ ఇద్దరు స్ట్రాటజిస్టులు షేక్ చేసే చాన్స్ కనిపిస్తోంది.