Foldable Phones: మొబైల్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేస్తున్నారు. అయితే వీరిలో కొందరు ఖరీదైన ఫోన్లు కొనుగోలు చేస్తుండగా.. మరికొందరు తమకు అనుగుణంగా బడ్జెట్లో మొబైల్స్ ను సొంతం చేసుకుంటున్నారు. అయితే చాలామంది తమ హోదా పెంచుకునేందుకు అధిక ధర కలిగిన డివైస్లను కొనుగోలు చేస్తుంటారు. వీటిలో ఫోల్డబుల్ మొబైల్స్ కొనుగోలు చేయడం వల్ల లగ్జరీగా ఫీల్ అయ్యేవారు. అయితే వీటిని ఒకప్పుడు కొన్ని కంపెనీలు మాత్రమే తయారు చేసి వాటిని మార్కెట్లోకి తీసుకువచ్చాయి. వాటిలో శాంసంగ్ మొదటిది అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత గూగుల్, హువావే వంటి సంస్థలు కూడా ఈ రకమైన మొబైల్స్ ను తీసుకు వచ్చాయి. అయితే ఒకప్పుడు కేవలం లగ్జరీ వరకు మాత్రమే ఉపయోగించిన వీటిని.. ఇప్పుడు ప్రైమరీగా కూడా ఉపయోగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో వీటి ధరలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం..
కామన్ మొబైల్స్ కంటే ఫోల్డబుల్ ఫోన్లు డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవి ఒకవైపు యూస్ చేసుకొని.. మరోవైపు అవసరం లేనప్పుడు దానిని మడిచి జేబులో స్టోర్ చేసుకోవచ్చు. దీంతో మొబైల్ స్క్రీన్ కు అత్యంత రక్షణగా ఉంటుంది. అలాగే మూవీస్ చూసేటప్పుడు ఫోల్డింగ్ ఓపెన్ చేయడంతో పెద్ద స్క్రీన్ పై సినిమాలు చూడవచ్చు. ఒకేసారి రెండు మూడు యాప్స్ ను ఉపయోగించేందుకు వీలుగా దీనిని తయారు చేశారు. ఈ మొబైల్స్ లో ఫోన్ ఫీచర్స్ తో పాటు.. ట్యాబ్ ఫ్యూచర్లు కూడా ఉండడంతో ప్రొఫెషనల్ వినియోగానికి చాలా ఉపయోగపడుతుంది అని అంటున్నారు. బిగ్ స్క్రీన్ పై సినిమాలు చూడడం.. గేమ్స్ ప్లే చేసుకోవడానికి ఇవి అనువుగా ఉంటాయి. అలాగే ఈ రకమైన మొబైల్స్ లో డాక్యుమెంట్లు రివ్యూ చేయడం.. నోట్స్ రాసుకోవడం.. మల్టీ విండో లాంటి ఫీచర్లు ఉంటాయి. దీంతో చాలావరకు టైం సేఫ్ అవుతుంది..
ప్రస్తుతం మొబైల్ బిగ్ స్క్రీన్ పెద్దగా వస్తుంది. కానీ దీనిని జేబులో ఉంచుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఈ ఫోల్డబుల్ మొబైల్స్ కావలసినప్పుడు బిగ్ స్క్రీన్ గా చూడొచ్చు.. అలాగే టేబుల్ పై ఫ్లెక్స్ మోడ్ లాగా మార్చి కూడా ఇతర పనులు చేస్తూనే మొబైల్ వర్క్ చేసుకోవచ్చు. సెల్ఫీలు తీసుకునే వారికి ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇందులో పెద్ద స్క్రీన్ ఉండడమే కాకుండా దీనిపై స్క్రోలింగ్ చాలా స్మూత్ గా ఉంటుంది. అలాగే ప్రతి వీడియోస్ స్పష్టంగా చూసుకోవచ్చు. ఇక ఇందులో ఆపరేటింగ్ సిస్టం ప్రత్యేకంగా ఆప్టిమైజ్ చేస్తారు. ఫ్లిప్ ఫోన్లో బయట చిన్న డిస్ప్లే పై క్లిక్ సెట్టింగ్స్ చేసుకొని నోటిఫికేషన్ ఏర్పాటు చేసుకోవచ్చు. సాధారణ కంటే వీటి స్క్రీన్లు అతిపెద్దగా ఉంటాయి. అంతేకాకుండా పవర్ డిస్ట్రిబ్యూషన్ బ్యాలెన్స్ గా ఉండడంతో చార్జింగ్ విషయంలో కూడా సపోర్ట్ గా ఉంటుంది..
ప్రస్తుతం ఇలాంటి రకమైన మొబైల్స్ సామ్సంగ్ గెలాక్సీ జెడ్ అందుబాటులో ఉంది. దీనిని రూ.1,77,00 ధరతో విక్రయిస్తున్నారు. అలాగే గూగుల్ పిక్సెల్ కూడా ఉంది.