ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ కు నెటిజన్లు నిన్నటి నుంచి చుక్కలు చూపిస్తున్నారు. ఫ్లిప్ కార్ట్ చేసిన తప్పు గురించి సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దేశంలో ప్రముఖ ఈకామర్స్ సంస్థల్లో అమెజాన్, ఫిప్ కార్ట్ రెండూ ముందువరసలో ఉంటాయి. అమెజాన్ భారతీయులకు చేరువ కావడానికి ఎప్పటికప్పుడూ అప్ డేట్ అవుతూ యాడ్స్ ద్వారా సైతం ప్రజలకు దగ్గర కావడానికి ప్రయత్నాలు చేస్తోంది.
అమెజాన్ కు పోటీగా ఫ్లిప్ కార్ట్ సైతం ఈ కామర్స్ రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే దేశంలోని పలు ప్రాంతాల్లో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సర్వీసులు అందుబాటులో ఉండవు. తాజాగా నాగాలాండ్ కు చెందిన ఒక నెటిజెన్ సోషల్ మీడియా వేదికగా ఫ్లిప్ కార్ట్ వస్తువులను నాగాలాండ్ కు ఎందుకు డెలివరీ చేయడం లేదని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు ఫ్లిప్ కార్ట్ తాము భారతదేశం వెలుపల తమ సర్వీసులకు అందించలేమని తెలిపింది.
ఫ్లిప్ కార్ట్ సమాధానం విన్న ఆ వ్యక్తికి, నెటిజన్లకు ఆ సమాధానం కోపం తెప్పించింది. సోషల్ మీడియా వేదికగా ఫ్లిప్ కార్ట్ ను నిన్నటినుంచి నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఫ్లిప్ కార్ట్ ఈశాన్య రాష్ట్రాలను వేరుగా చూస్తోందా..? అని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఇండియాలో ఉన్న ప్రాంతం గురించి ఫ్లిప్ కార్ట్ అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.
విషయం ఫ్లిప్ కార్ట్ యాజమాన్యం దృష్టికి వెళ్లడంతో ఫ్లిప్ కార్ట్ ఆ సమాధానాన్ని వెంటనే డిలేట్ చేయడంతో పాటు క్షమాపణలు చెప్పింది. సర్వీస్ ఎగ్జిక్యూటివ్ చేసిన పొరపాటు వల్ల అలా జరిగిందని సంజాయిషీ ఇచ్చుకుంది. దేశంలోని ఏ ప్రాంతానికైనా తమ వస్తువులను డెలివరీ చేస్తామని ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది. ఫ్లిప్ కార్ట్ వివరణ ఇచ్చినా ఇంటర్నెట్ లో ఆ సంస్థపై ట్రోల్స్ ఆగకపోవడం