Flight Ticket: విమానం ఎక్కాలన్నది చాలా మంది కల.. దానిని ఇటీవల సామాన్యులు కూడా నెరవేర్చుకుంటున్నారు. అయితే ఇంకా ఆ కల నెరవేర్చుకోలేని మిడిల్ క్లాస్ ప్రజల కోసం విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తాజాగా ఫ్లాష్ సేల్‌ను ప్రకటించింది. దీని ప్రకారం తమ వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా ఎక్స్‌ప్రెస్ లైట్ కింద బుక్ చేసుకుంటే చార్జీలు కేవలం రూ.883 నుంచే ప్రారంభమవుతాయని తెలిపింది.
ఇతర మాధ్యమాల్లో ఇలా..
అలాగే ఇతర మాధ్యమాల ద్వారా ఎక్స్‌ప్రెస్ వాల్యూ కింద టికెట్ బుక్ చేసుకుంటే రూ.1,096 నుంచి చార్జి వసూలు అవుతాయని వెల్లడించింది. సెప్టెంబర్ 30 వరకు ప్రయాణాల కోసం జూన్ 28 వరకు చేసుకునే బుకింగ్స్‌కు ఈ చార్జీలు వర్తిస్తాయని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తెలిపింది.
వెబ్‌సైట్‌లో బుక్ చేస్తే..
ఇక ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అధికారిక వెబ్‌సైట్ https://airindiaexpress.com నుంచి టికెట్ బుక్ చేసుకునే వినియోగదారులు ఇటీవల లాంచ్ చేసిన జీరో చెక్ ఇన్ బ్యాచేజ్ ఎక్స్‌ప్రెస్ లైట్‌కు ప్రత్యేక డిస్కౌంట్లతో ఎక్స్‌క్లూజివ్ యాక్సెస్ పొందవచ్చు. ఎక్స్‌ప్రెస్ లైట్ చార్జీలు అదనంగా 3 కిలోల క్యాబిన్ బ్యాగేజీని ఎలాంటి రుసుము లేకుండా ముందస్తుగా బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. అలాగే దేశీయ విమానాలలో 15 కిలోలకు రూ.1000, అంతర్జాతీయ విమానాలలో 20 కిలోలకు రూ.1,300 చొప్పున చెక్ ఇన్ బ్యాగేజీ కోసం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తెలిపింది.