Homeజాతీయ వార్తలుEconomic Inequality: ఆర్థిక అసమానతల భారతం.. ధనికుల్లో 85 శాతం వాళ్లే!

Economic Inequality: ఆర్థిక అసమానతల భారతం.. ధనికుల్లో 85 శాతం వాళ్లే!

Economic Inequality: దేశంలో ఆర్థిక అంతరాలు.. అసమానతలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. 1980లో మొదలైన ఈ అంతరాలూ క్రమంగా పెరుగుతూ పోతున్నాయి. ఉన్నవాళ్లు మరింత సంపన్నులుగా మారుతుండగా, పేద, మధ్య తరగతి ప్రజలు మరింత పేదలుగా మారుతున్నారు. తాజాగా వరల్డ్‌ ఇన్‌ ఈక్వాలిటీ ల్యాబ్‌ భారత్‌లో ఆర్థిక అంతరాలు గణనీయంగా పెరిగినట్లు తెలిపింది. ధనికుల్లో 90 శాతం అగ్రకులాల చేతిలో ఉన్నట్లు వెల్లడించింది.

నివేదిక వివరాలు ఇలా…
ట్యాక్స్‌ జస్టిస్‌ అండ్‌ వెల్త్‌ రీ డిస్ట్రిబ్యూషన్‌ ఇన్‌ ఇండియా పేరుతో రూపొందించిన నివేదికలో కీలక అంశాలను వివరించింది. దేశంలోని బిలియనీర్ల సంపదలో 88.4 శాతం అగ్రకులాల మధ్య కేంద్రీకృతమై ఉందని నివేదిక డేటా వివరణాత్మక విశ్లేషణ అందిస్తోంది. అత్యంత వెనుకబడిన వర్గాల్లో షెడ్యూల్డ్‌ తెగలకు సంపన్న భారతీయుల్లో స్థానం లేకపోవడం గమనార్హం.

భారీగా పెరిగిన అసమానత..
ఆర్థిక అసమాన బిలియనీర్‌ సంపదను మించి విస్తరించింది. 2018–19లో ఆల్‌ ఇండియా డెంట్‌ అండ్‌ ఇన్వెస్టిమెంట సర్వే ప్రకారం జాతీయ సంపదలో అగ్రవర్ణాల వాటా దాదాపు 55 శాతం. సంపద యాజమాన్యంలోని ఈ స్పష్టమైన వ్యత్యాసం భారత దేశ కుల వ్యవస్థలో లోతుగా పాతుకుపోయిన ఆర్థిక అసమానతలను నొక్కి చెబుతోంది.

1980 నుంచి పెరుగుదల..
స్వాతంత్య్రానంతరం దేశంలో ఆదాయం క్షీణించింది. సంపద అసమానతలు 1980వ దశకంలో పెరగడం మొదలైంది. 2000వ దశకం నుంచి మరింత పెరిగింది. 2014–15 నుంచి 2022–23 మధ్య కాలంలో సంపద కేంద్రీకరణ పరంగా అసమానతలు శిఖరాగ్రానికి చేరాయి. ముఖ్యంగా టాప్‌ 1 శాతం జనాభా దేశంలోని మొత్తం సంపదలో 40 శాతానికిపైగా నియంత్రిస్తుంది. ఇది 1980లో ఉన్న 12.5 శాతం కంటే పెరిగింది. మొత్తం ప్రీట్యాక్స్‌ ఆదాయంలో 22.6 శాతం వీరు సంపాదిస్తున్నారు. ఇది 1980లో కేవలం 7.3 శాతంగా ఉండేది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version