https://oktelugu.com/

Utsavam Trailer: ప్రయోగాలకు తెరలేపిన బ్రహ్మానందం.. ఆయనలో ఈ యాంగిల్ కూడా ఉందా!

పరిపూర్ణ నటుడు అనిపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు బ్రహ్మానందం. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ట్రైలర్ విడుదల కాగా... కొత్త కోణం ఆవిష్కరించాడు. జనాలు ఆయన డైలాగ్ డెలివరీ చూసి ఆశ్చర్యపోయారు. పౌరాణిక సంభాషణలు ఆయన పలికిన తీరు అబ్బురపరిచాయి.

Written By:
  • S Reddy
  • , Updated On : September 11, 2024 / 03:26 PM IST

    Utsavam Trailer

    Follow us on

    Utsavam Trailer: లెజెండరీ కమెడియన్స్ లో బ్రహ్మానందం ఒకరు. వెయ్యికి పైగా చిత్రాల్లో నటించి రికార్డు నెలకొల్పారు. ఆయన హాస్యానికి కేరాఫ్ అడ్రస్. ఆయన్ని స్క్రీన్ పై చూస్తే చాలు నవ్వు వచ్చేస్తుంది. అలాగే మీమ్స్ గాడ్. మీమర్స్ బ్రహ్మానందం ఎక్సప్రెషన్స్ తో లక్షల కొద్దీ మీమ్స్ రూపొందించారు. బ్రహ్మానందం ఎక్స్ప్రెషన్స్ అత్యంత సహజంగా, నవ్వు తెప్పించే విధంగా ఉంటాయి.

    స్టార్ హీరోల చిత్రాల్లో కూడా బ్రహ్మానందం కామెడీ ట్రాక్స్ ప్రధానంగా ఉంటాయి. అసలు బ్రహ్మానందం కామెడీ వలనే ఆడిన సినిమాలు కోకొల్లలు. కాగా బ్రహ్మానందంలో తెలియని కోణాలు చాలా ఉన్నాయి. ఆయన హాస్య నటుడే కాదు. అద్భుతంగా డ్రాయింగ్స్ వేస్తారు. బ్రహ్మానందం పెన్సిల్ ఆర్ట్స్ అత్యంత ప్రాచుర్యం పొందాయి. వెంకటేశ్వర స్వామి, శ్రీరామాంజనేయుల బొమ్మలు ఆయన అద్భుతంగా గీశారు.

    బ్రహ్మానందంలో మంచి వక్త ఉన్నాడు. ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేలా ఆయన ప్రసంగాలు ఉంటాయి. ఈ మధ్య బ్రహ్మానందం కేవలం కమెడియన్ అనే ట్యాగ్ వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రయోగాత్మక చిత్రాలు ఎంచుకుంటున్నారు. రంగమార్తాండలో నటుడిగా ఆయన ఏడిపించాడు. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన ఆ చిత్రంలో వైభవం కోల్పోయిన రంగస్థల కళాకారుడిగా ట్రాజిక్ రోల్ చేశారు.

    తాజాగా ఉత్సవం మూవీలో బ్రహ్మానందం రంగస్థల నటుడిగా మరోసారి నటించారు. ఉత్సవం మూవీ ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ బ్రహ్మానందం చెప్పిన మహాభారతంలోని పౌరాణిక డైలాగ్ తో ప్రారంభం అవుతుంది. బ్రహ్మానందం వాగ్ధాటి, ఉచ్చారణ గూస్ బంప్స్ రేపాయి. ఉత్సవం మూవీ సెప్టెంబర్ 13న విడుదల కానుంది. ఈ మూవీలో దిలీప్ ప్రకాష్, రెజీనా కాసాండ్రా హీరో హీరోయిన్ గా నటించారు.

    ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, నాసర్, బ్రహ్మానందం, అలీ, ప్రేమ, ఎల్ బి శ్రీరామ్, ప్రియదర్శి కీలక రోల్స్ చేశారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించారు. ఉత్సవం ట్రైలర్ ఆకట్టుకున్న నేపథ్యంలో అంచనాలు పెరిగాయి. సీనియర్ నటులు మెప్పించనున్నారు.