Honda Activa: పట్టణాలు, నగరాల్లో చిన్న చిన్న అవసరాల కోసం Honda కంపెనీ నుంచి మార్కెట్లోకి వచ్చిన Activa స్కూటర్లు చాలామంది కొనుగోలు చేశారు. అయితే ఆ సమయంలో సుజికి వంటి కొన్ని కంపెనీలు మార్కెట్లోకి స్కూటర్లు తీసుకువచ్చినా కూడా యాక్టివా ను బీట్ చేయలేకపోయింది. అయితే ఇటీవల విద్యుత్ బైకులు ఎక్కువగా మార్కెట్లోకి రావడంతో పెట్రోల్ బైకులపై ఆసక్తి తగ్గిపోయింది. కానీ ఇప్పుడు హోండా, సుజుకి కంపెనీలు సైతం ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావడంలో ముందుంటున్నారు. అందులోనూ Honda కంపెనీ యాక్టివా ను నేటి తరానికి అనుగుణంగా మార్చి ప్రవేశపెట్టింది. సిటీ రైడర్స్ తో పాటు లాంగ్ డ్రైవ్ చేసే వారికి అనుగుణంగా డిజైన్ మార్చి ఇంజిన్ పనితీరును మెరుగుపరిచింది. మరి ఈ స్కూటర్ ఎలా ఉందో ఎప్పుడూ చూద్దాం.
Honda కంపెనీ నుంచి లేటెస్ట్ గా Activa 7G బైక్ త్వరలో రాబోతుంది. దీనికి సంబంధించిన పరీక్షలు ఇప్పటికే చేశారు. 110 సిసి ఇంజన్ ను అమర్చిన ఈ స్కూటర్లో స్మార్ట్ ఫీచర్లతో పాటు వినియోగదారులకు అనుగుణంగా ధరను నిర్ణయించారు. అయితే ఈ విషయాలను అధికారికంగా ప్రకటించకపోయినా ఆన్లైన్లో ఈ స్కూటర్ సమాచారం తెలుస్తోంది. యాక్టివా 7G ఎక్స్టీరియర్ డిజైన్ విషయానికి వస్తే దీనికి LED హెడ్ లాంప్స్ ఆకాశనియంగా ఉన్నాయి. అలాగే టెయిల్ లైట్స్ కూడా రాత్రి సమయంలో సౌకర్యాన్ని కలిగిస్తాయి. బాడీ ప్యానెల్ మొత్తం ప్రీమియం లుక్ ను తీసుకొస్తుంది. సీటు కింద కావాల్సిన స్థలం ఉండడంతో సామాగ్రిని స్టోర్ చేసుకోవచ్చు. గతంలో కంటే ఇప్పుడు స్కూటర్ సీటు ఎత్తు తగ్గించారు. దీంతో కొత్తగా స్కూటర్ నడిపే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే అలాగే వీల్స్, మెటాలిక్ రంగుల ప్యాలెట్, మ్యాట్ గ్రేస్ వంటివి సౌకర్యంగా ఉంటాయి.
ఈ స్కూటర్లో మెరుగైన ఇంజన్ ను అమర్చారు. ఇందులో 109. 51సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంది. ఇది ఆటోమేటిక్ కేర్ బాక్స్ తో పనిచేస్తుంది. 8 బీహెచ్పీ పవర్ తో పాటు 8.9 ఎన్ ఎం టార్కును రిలీజ్ చేస్తుంది. నిమిషాల్లో 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే ఇది లీటర్ ఇంధనానికి 55 నుంచి 60 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి ఉన్న ట్యాంకులో 5.3 లీటర్ ఇంధనాన్ని స్టోర్ చేసుకోవచ్చు.
ఈ స్కూటర్లో సిటీ రైడర్స్కు అనుగుణంగా ఫీచర్స్ ను అమర్చారు. డిజిటల్ క్లస్టర్ బ్లూటూత్ కలెక్టివిటీ, మిర్రర్ రింగ్ కాల్స్, మెసేజ్ అలర్ట్, డాష్ బోర్డు లోని టర్న్ బై టర్న్ నావిగేషన్ వంటివి సౌకర్యం ఇస్తాయి. అలాగే యుఎస్బి టైప్ సి పోర్టు మొబైల్ ఛార్జింగ్ కోసం ఉపయోగపడుతుంది. పెద్ద డ్రమ్ తో కూడిన కంబైన్డ్ బ్రేక్ సిస్టం, ఫ్రంట్ డిస్క్ వంటివి సేఫ్టీని ఇస్తాయి.
2026 దీపావళి నాటికి దీనిని మార్కెట్లోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. ఇది మార్కెట్లోకి వస్తే రూ.80,000 ప్రారంభ ధరతో విక్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. మార్కెట్లో ఉన్న టీవీఎస్ జూపిటర్ వంటి స్కూటర్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.