Fake Online Shopping Websites: ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు షాపింగ్ చాలా ఈజీ అయిపోయింది. ఇంట్లో కూర్చొని ఫోన్‌లో నుండే మనకి కావాల్సిన వస్తువులను ఈ కామర్స్ సైట్ల నుంచి కొనుగోలు చేసే పరిస్థితి వచ్చింది. నిత్యావసర వస్తువులు దగ్గర నుంచి కూరగాయల వరకు ప్రతీది డోర్ డెలివరీ అవుతోంది. అయితే ఇదే సమయంలో టెక్నాలజీని ఉపయోగించుకుని చేస్తున్న నేరాల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. ఈ కామర్స్ సైట్‌లో మనకు అవసరమైన వస్తువుల కొనుగోలు చేసే క్రమంలో వినియోగదారులను బురిడీ కొట్టిస్తూ దోపిడీకి పాల్పడుతన్నారు సైబర్ నేరగాళ్లు.
ఓఎల్‌ఎక్స్, క్వికర్, కార్ దేఖో వంటి సైట్ల ద్వారా మోసాలు
ఆన్‌లైన్‌లో వస్తువులు కొనుగోలు చేసేముందు జాగ్రత్తగా ఆలోచించాలని పోలీసులు సూచిస్తున్నారు. మనం ఏ వస్తువునైనా కొనుగోలు చేయాలన్నా, సెకండ్ హ్యాండ్ వస్తువులను కొనుగోలు చేయాలన్న దాదాపు ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఓఎల్‌ఎక్స్, క్వికర్, కార్ దేఖో వంటి వెబ్‌సైట్లలో సెకండ్ హ్యాండ్ వస్తువులను, కార్లను విక్రయిస్తుంటారు.
Also Read: Minister Roja Comments: చూసుకోండబ్బా.. జబర్ధస్త్ పై మంత్రి రోజా అనూహ్య కామెంట్స్
వస్తువులను చూడకుండా డబ్బులు చెల్లించొద్దు..
తాము అమ్మదలుచుకున్న వస్తువులను ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో పెట్టి కొనుగోలు చేసే ఆసక్తి ఉన్న వారిని మోసం చేయడానికి సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తున్నారు. సైట్‌లో పెట్టిన ఫొటోలను చూసి మోసపోయి, వాటిని కొనుగోలు చేయడానికి ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లింపు చేస్తున్న వినియోగదారులు సైబర్ మోసాలకు గురవుతున్నారు. అందుకే సైబర్ క్రై మ్ పోలీసులు వస్తువులను డైరెక్టుగా చూడకుండా, అమ్మే వ్యక్తులను డైరెక్టుగా కలవకుండా ముందుగా డబ్బులు చెల్లించవద్దు అని సూచిస్తున్నారు.
ఐడీ ప్రూఫ్స్ పంపినా డబ్బులు పంపొద్దు..
కొనుగోలుదారులను నమ్మించడం కోసం సైబర్ నేరగాళ్లు ఐడీ ప్రూఫ్ పంపిస్తున్నారు. కానీ ఐడీ ప్రూఫ్స్ చూపించినా సరే డబ్బులు పంపొంద్దని అంటున్నారు పోలీసులు. టెక్నాలజీని ఉపయోగించుకోవటంతో పాటుగా, టెక్నాలజీతో జరిగే మోసాలను గ్రహించడంలో కూడా అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన ఉండాలని చెబుతున్నారు. అందుకే ఆన్‌లైన్‌లో ఓఎల్‌ఎక్స్ క్వికర్, కార్ దేఖో వంటి సైట్లలో కొనుగోలు చేసేటప్పుడు ముందుగా డబ్బులు చెల్లించవద్దని, వస్తువులు ఫిజికల్‌గా చూసిన తర్వాతనే నేరుగా చెల్లింపులు చేయాలని సలహా ఇస్తున్నారు.