Festive Season : ఈరోజుల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిత్యం వందలాది మంది ఈ వ్యాపారంలోకి వస్తుంటారు. అయితే, రియల్ ఎస్టేట్ వ్యాపారంతో సంపదను పెంచుకోవడానికి అనుసరించాల్సిన కొన్ని పద్ధతులు ఉంటాయి. భారతదేశంలో ప్రజలకు అనేక రకాల పెట్టుబడి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ పథకాలు కూడా నష్ట భయం లేకుండా మంచి వడ్డీ రేటును అందిస్తాయి. అయితే ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో అత్యధిక లాభాలను అందించేది రియల్ ఎస్టేట్ వ్యాపారం అనే చెప్పాలి. తక్కువ సమయంలో ఎక్కువ సంపదను సృష్టిస్తుంది. ఆస్తి విలువ పెరగడం, దీర్ఘకాలంలో ప్రాపర్టీ ధరలు పెరగడం, పెట్టుబడిదారుల పోర్ట్‌ఫోలియోను మార్చేది ఈ వ్యాపారమే. ప్రస్తుతం అందరికీ మంచి ఆదాయ వనరుగా మారిందని చెప్పాలి. రియల్ ఎస్టేట్ మార్కెట్ ట్రెండ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అనేక రకాలు ఉన్నాయి. రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్ ప్రాపర్టీలలో డీల్ చేసే వారికి ఎప్పుడూ ఒకే రకమైన లాభాలు రాకపోవచ్చు. ఈ వ్యాపారంలో లాభాలు వ్యక్తుల అభిరుచులు, మార్కెట్ పరిస్థితులు, ఇతర అంశాలపై ఆధారపడి ఉంటాయి. సంపద సృష్టి, పోర్ట్‌ఫోలియో విస్తరణకు రియల్ ఎస్టేట్ పెట్టుబడులు ఉత్తమ ఎంపికలు.
ఈ ఏడాది పండుగల సీజన్ అయినప్పటికీ రియల్ ఎస్టేట్ డెవలపర్లు ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించడం లేదు. ఏటా నవరాత్రుల నుంచి దీపావళి వరకు మార్కెట్‌లో ఎన్నో రకాల ఆఫర్లు రావడంతో ఏం చేయాలో తెలియక కొనుగోలుదారులు అయోమయంలో పడిపోయేవారు. కానీ, ఈ ఏడాది మార్కెట్లో పెద్దగా ఆఫర్లు కనిపించడం లేదు. గత కొన్ని నెలల్లో విపరీతమైన అమ్మకాల కారణంగా, డెవలపర్‌ల దగ్గర ఎక్కువ గృహాలు అందుబాటులో లేవని నిపుణులు భావిస్తున్నారు. దీంతో వారు ఆఫర్లు ప్రకటించాల్సిన అవసరం లేకుండా పోయింది.
డిస్కౌంట్లు , ఆఫర్లకు కారణం
మనీ కంట్రోల్ రిపోర్ట్ ప్రకారం.. ప్రస్తుతం మార్కెట్‌లో చౌక, మధ్య స్థాయి ధరల ఇండ్ల జాబితా ఎక్కువగా లేదు. గత కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్ రంగం ఈ సమస్యతో సతమతమవుతోంది. ఈ కారణంగా వారు జాబితాను క్లియర్ చేయడానికి భారీ తగ్గింపులు, ఆఫర్లను ఆశ్రయించవలసి వచ్చింది. ఇప్పుడు కోవిడ్ 19 తర్వాత పరిస్థితిలో పెద్ద మార్పు వచ్చింది. ప్రజలు పెద్ద పెద్ద ఇళ్లు కొంటున్నారు. లగ్జరీ ఇళ్ల బుకింగ్‌లో కూడా భారీ పెరుగుదల ఉంది. ఇళ్ల లిస్ట్ వేగంగా తగ్గింది. దీని వల్ల ప్రస్తుతం రియల్ ఎస్టేట్ డెవలపర్లపై ఎలాంటి ఒత్తిడి లేకుండా పోయింది.
కారు, ఫర్నీచర్, ధరలపై ఎలాంటి తగ్గింపు లేదు
రియల్ ఎస్టేట్ డెవలపర్లు ప్రస్తుతం టాప్ 7 నగరాల్లో ఇళ్లను విక్రయించడానికి బంగారు నాణేలు, ఫోన్లు, మాడ్యులర్ కిచెన్‌లు వంటి వాటిని ఉచితంగా ఇస్తున్నారు. సాధారణంగా ప్రతి సంవత్సరం ఇచ్చే భారీ డిస్కౌంట్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఇంతకుముందు ఇళ్ల ధరలపై 5 నుంచి 10 శాతం రాయితీ ఇచ్చేవారు. ఇది కాకుండా లక్షల రూపాయల క్యాష్‌బ్యాక్‌ను కూడా ఆఫర్ చేసేవి కంపెనీలు. కొంతమంది డెవలపర్లు కార్లు ఇచ్చేవారు. కొందరు ఫర్నిచర్, గృహోపకరణాలు ఇచ్చేవారు. గత నెలలో ఇళ్ల విక్రయాలు కొంత తగ్గుముఖం పట్టినా.. అంతకు ముందు జరిగిన విపరీతమైన విక్రయాల కారణంగా పరిస్థితి అంత సీరియస్ గా అయితే లేదు.
ప్రీమియం , లగ్జరీ హౌసింగ్ సెగ్మెంట్‌పై ఎక్కువ దృష్టి
జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో మిడ్-సెగ్మెంట్ గృహాల విక్రయాలు వార్షిక ప్రాతిపదికన దాదాపు 13 శాతం క్షీణించాయి. ఇది కాకుండా రూ.50 లక్షల లోపు ఇళ్ల విక్రయాలు 14 శాతం తగ్గాయి. గోద్రెజ్ ప్రాపర్టీస్, మాక్రోటెక్ డెవలపర్స్ వంటి పెద్ద ప్లేయర్‌లు ఇప్పుడు తమ దృష్టిని ప్రీమియం, లగ్జరీ హౌసింగ్ సెగ్మెంట్‌పైనే కేంద్రీకరించారు.
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Even though it is the festive season this year real estate developers are not announcing offers and discounts
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com