Bills by Phone Pay : కాలం మారుతున్న కొద్దీ ఆన్ లైన్ ట్రాన్జాక్షన్ పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఒకప్పడు ఒక వస్తువు కొనుగోలు చేసేందకు అవసరమైన డబ్బును చేతిలో ఉంచుకొని మార్కెట్లోకి వెళ్లేవారు. కానీ నోట్ల రద్దు తరువాత ఆన్లైన్ లోనే ఎక్కువగా మనీ ట్రాన్స్ ఫర్ చేస్తున్నారు. చిన్న మొత్తాల నుంచి పెద్ద అమౌంట్ వరకు ఎవరికైనా, ఎక్కడికైనా పంపించుకునే సదుపాయం ఉంటుంది. దీంతో చాలా మంది దీనిపైనే ఆధారపడుతున్నారు. అయితే ఆన్ లైన్ ట్రాన్జాక్షన్ చేసే సమయంలో సంబంధిత బ్యాంకు అకౌంట్ లో డబ్బులు ఉండాలి. డబ్బులు లేకుంటే ఎట్టి పరిస్థితుల్లో చేయరాదు. కానీ ఇప్పుడు బ్యాంకులో ఒక్కరూపాయి లేకున్నా నగదును ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. అయితే దీనిని ఎవరు చెల్లించాలి? ఎలా చెల్లించాలి? అనే వివరాల్లోకి వెళితే..
2024 ఆర్థిక సంవత్సరంలో 164 మిలియన్ల డిజిటల్ పేమేంట్స్ జరిగినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. దీంతో ఆన్ లైన్ మనీ ట్రాన్స్ ఫర్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆన్ లైన్ లో డబ్బులు ఎవరికైనా పంపించాలంటే బ్యాంకు అకౌంట్ లో నగదు ఉండాలి. ముందుగా నగదును డిపాజిట్ చేసిన తరువాతే ట్రాన్జాక్షన్ జరుపుకోవడానికి వీలు ఉంటుంది. బ్యాంకులో డబ్బులు ఉన్న తరువాత ఆ బ్యాంకును ఫోన్ పే లేదా గూగుల్ పే మనీ ట్రాన్స్ ఫర్ కులింక్ చేసిన తరువాత డిజిటల్ పేమేంట్స్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం డెబిట్ కార్లు వివరాలు అందించాల్సి ఉంటుంది. ఈ ఆన్ లైన్ పేమేంట్స్ స్టార్ట్ అయ్యాక.. ఏటీఎం ల వద్ద క్యూలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా పోయింది.
అయితే చాలా మంది డెబిట్ కార్డును కలిగి ఉన్నా.. అందులో సమయానికి డబ్బులు ఉంచడం లేదు. దీంతో కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డులు ఇస్తూ వస్తున్నాయి. ఈ క్రెడిట్ కార్డు ద్వారా వివిధ అవసరాలు తీర్చుకొని గడువుతేదీలోగా బిల్లును చెల్లించాల్సి ఉంటుంది. పెట్రోల్ నుంచి షాపింగ్ వరకు క్రెడిట్ కార్డును ఉపయోగించే అవకాశాన్ని కల్పించారు. అయితే క్రెడిట్ కార్డు వాడిన బిల్లును గడువుతేదీలోగా చెల్లించకపోతే భారీగా జరిమానా విధిస్తుంది.
ఇప్పుడు కొత్తగా కొన్ని బ్యాంకులు ఓవర్ డ్రాప్ట్ సౌకర్యాన్ని కలిగిస్తున్నాయి. దీని ప్రకారం బ్యాంకులో డబ్బులు లేకపోయినా ఓవర్ డ్రాప్ట్ ద్వారా కొన్ని చెల్లింపులు చేయొచ్చు. లేదా అవసరమున్న వరకు డబ్బులు తీసుకోవచ్చు. అయితే ఓవర్ డ్రాప్ట్ నుంచి డబ్బులు తీసుకున్న వాళ్లు సైతం సరైన సమయానికి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. లేకపోతే నిర్ణీత మొత్తంలో వడ్డీని విధిస్తారు. అయితే గడవుతేదీలోగా చెల్లిస్తే అదనపు వడ్డీ నుంచి తప్పించుకోవచ్చు. ఓవర్ డ్రాప్ట్ సౌకర్యాన్ని వాడుకునేవాళ్లు ఈఎంఐ ద్వారా చెల్లించాల్సిన అవసరం లేదు. కొంత మొత్తంలో చెల్లించవచ్చు. అయితే మిగిలిన మొత్తానికి మాత్రం వడ్డీని విధిస్తారు. అత్యవసర సమయాల్లో ఇతరులను డబ్బు అడిగే కంటే ఇలా ఓవర్ డ్రాప్ట్ ద్వారా డబ్బులు తీసుకోవచ్చు. అయితే ఎంత ఓవర్ డ్రాప్ట్ సౌకర్యం అనేది ఆయా బ్యాంకులను బట్టి ఉంటుది.