Homeబిజినెస్EPFO News: 20 రోజుల్లోపై డబ్బు జమకాకపోతే 12 శాతం వడ్డీ..

EPFO News: 20 రోజుల్లోపై డబ్బు జమకాకపోతే 12 శాతం వడ్డీ..

EPFO News: ప్రభుత్వేతర, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కల్పించేందుకు ఉద్యోగుల భవిష్యనిథి చాలా ఉపయోగకరంగా ఉంటోంది. ప్రతి నెల జీతంలో నుంచి కొంత మొత్తం సేవ్ అయి.. రిటైర్మెంట్ అయిన తరువాత ఈ మొత్తాన్ని వడ్డీ రూపంలో తిరిగి ఉద్యోగులకు అందిస్తారు. అయితే రిటైర్మెంట్ కు ముందే అత్యవసరం ఏర్పడితే ఇందులో నుంచి 80 శాతం వరకు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో కొందరు క్లెయిమ్ చేసుకుంటే చాలా సమయం పడుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఖాతాదారులు క్లెయిమ్ చేసుకున్న 20 రోజుల్లోపే డబ్బులు తమ ఖాతాల్లో జమ కావాలని కొత్త రూల్ తెచ్చారు. దీంతో ఈ రూల్ ఉద్యోగులకు ప్రయోజనం ఏర్పడనుంది. ఇంతకీ ఈ రూల్ ఎలా ఉందంటే?

EPFO డబ్బులు విత్ డ్రా చేసుకునేవారికి గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. గతంలో ఇందులో ఉన్న డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి ఆలస్యం అయేది. కానీ ఇప్పుడు కొత్తగా EPF Scheme లోని Para 72 (7) ప్రకారం ఖాతాదారులు క్లెయిమ్ చేసుకున్న తరువాత 20 రోజుల్లోనై సెటిల్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ అలా కాని పక్షంలో 12 శాతం వడ్డీతో ఫెనాల్టీని చెల్లిస్తారు. గడువులోగా క్లెయిమ్ పరిష్కారం కాకపోతే ఖాతాదారులు ఫిర్యాదు చేయవచ్చు. ఈ పిర్యాదును పరిశీలించి నిజమని తేలితే వడ్డీ చెల్లిస్తారు.

అయితే ఇక్కడ ఖాతాదారులు తమ క్లెయిమ్ చేసుకొని 20 రోజుల్లోపు చెక్ చేస్తూ ఉండాలి. అంతేకాకుండా క్లెయిమ్ లో ఏదైనా లోపం ఉండి.. లేదా ఈ కేవైసీ సమస్య, బ్యాంకు ఖాతా వివరాల్లో తప్పులు ఉంటే మాత్రం ఈ ఫెనాల్టీ వర్తించదు. అన్నీ సక్రమంగా ఉండి డబ్బులు జమ కాకపోతే మాత్రం ఫిర్యాదు చేసుకోవచ్చు. దీనిని ఈపీఎఫ్ వెబ్ సైట్ ద్వారా ఎప్పటికప్పుడు స్టేటస్ చెక్ చేస్తూ ఉండాలి.

ఖాతాదారులు క్లెయిమ్ చేసుకొని 20 రోజుల గడువు దాటినా కూడా తమ డబ్బు బ్యాంకు ఖాతాలో జమ కాకపోతే ఆన్ లైన్ లో ఫిర్యాదు చేయవచ్చు. ముందుగా EPFIGMSద్వారా కంప్లెయింట్ ఇవ్వాలి. ఈ పోర్టల్ లో పీఎఫ్ సభ్యులు, ఈపీఎస్ పెన్షనర్లు, యజమానులు తమ సమస్యలను తెలపవచ్చు. ఫిర్యాదు చేసిన వెంటనే ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. దీని ఆధారంగా స్టేటస్ చెక్ చేస్తూ ఉండాలి. అయితే ఫిర్యాదు చేసేటప్పుడు UAN, PFనెంబర్ సరైన విధంగా నమోదు చేయాలి. అలాగే ఫిర్యాదు చేసిన తరువాత వచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్ భద్రపరుచుకోవాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Nara Lokesh

Nara Lokesh: సాక్షి.. పాడిందే పాట.. లోకేష్ మీద తేల్చుకోవాల్సింది కోర్టులో..

Nara Lokesh: ఒక తప్పు జరిగింది. ఆ తప్పును ఆధారాలతో సహా నిరూపించాలి అంటే మన దగ్గర దమ్ము ఉండాలి. అన్నిటికి మించి సాక్షాలు ఉండాలి. ఆ తర్వాత కోర్టు దాకా వెళ్లాలి....
August School Holiday

August School Holidays: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఆగస్టులో ఏకంగా 10 రోజులు..!

August School Holidays: సాధారణంగా విద్యార్థులకు సెలవులు అంటే చాలా ఇష్టం. పాఠశాలలకు వరుసగా సెలవులు వస్తున్నాయంటే వారిలో సరదా వేరు. అటువంటి సరదా తెచ్చింది ఆగస్టు నెల. ఒకటి కాదు రెండు...
Delhi Protests

Delhi Protests: సీజేపీ నిరసనల వెనుక రెజీమ్‌ చేంజ్‌ వ్యూహాలు.. అలర్ట్‌ కాకుంటే ఆ దేశాల గతే!

Delhi Protests: ఢిల్లీలో ఇటీవల జరిగిన నిరసనలు కేవలం సాధారణ ప్రజా ఉద్యమం కాదని, వ్యవస్థీకృత రెజీమ్‌ చేంజ్‌ ప్రయత్నంగా చూడాల్సిన అవసరం ఉందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శాంతియుత మార్గాల ద్వారా...
Bhogapuram Airport

Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం పై రీల్స్.. ఏపీ ప్రభుత్వం సంచలనం!

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం పై రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రచారం చేస్తోంది. వినూత్న కార్యక్రమాలను చేపడుతోంది. పాఠశాల విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు.. ఈనెల 26 నుంచి విద్యార్థులకు రకరకాల పోటీలు...
Team India Test Cricket

Team India Test Cricket: ఈ గాయపడ్డ సింహాలను నమ్ముకుంటే.. లంకా దహనం అయినట్టే..

Team India Test Cricket: వైట్ బాల్ ఫార్మాట్ లో టీమిండియా చెప్పుకునే స్థాయిలో విజయాలు సాధించలేకపోతోంది. అలాగని రెడ్ బార్ ఫార్మాట్లో అదరగొట్టడం లేదు.. కాకపోతే వచ్చే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్...
Oktelugu Epaper