EPFO claim : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్ఓ) గురించి ప్రతీ ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగికి తెలిసే ఉంటుంది. ఇందులో వేసిన రూపాయి కూడా చివరి వరకు మనకు అక్కరకు వస్తుంది. పైగా దీనిలో ఉన్న డబ్బుకు ప్రభుత్వం వడ్డీ కూడా కలుపుతుంది. ఫలితంగా అది పెరుగుతూనే ఉంటుంది. కొవిడ్ ముందు వరకు చాలా స్ట్రిక్ట్ గా ఉన్న ఈపీఎఫ్ఓ ఆ తర్వాత కొన్ని నిబంధనలను సడలించింది. దీన్ని మధ్య లోనే విత్ డ్రా చేసుకోవడం, ఇంకా వివిధ రకాల పన్ను ప్రయోజనాలను కలిస్తుంది.
ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) నిబంధనల్లో మార్పులు చేసింది. అదే సమయంలో, వైద్యం, విద్య, వివాహం, గృహ ప్రయోజనాల అడ్వాన్స్ క్లెయిమ్స్ కోసం ఆటో-మోడ్ సెటిల్మెంట్ సదుపాయాన్ని కూడా ఈపీఎఫ్ఓ అందించింది. 6 కోట్లకు పైగా ఉన్న పీఎఫ్ ఖాతాదారులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు నిధులను అందించే సదుపాయం ఇది. గతంలో ఈపీఎఫ్ఓ ఈ సదుపాయాన్ని క్లెయిమ్ చేసుకునేందుకు 15 నుంచి 20 రోజులు పట్టేది, కానీ ఇప్పుడు ఈ పని 3 నుంచి 4 రోజుల్లో పూర్తవుతుంది. సభ్యుల అర్హత, డాక్యుమెంట్లు, ఈపీఎఫ్ ఖాతా, బ్యాంకు ఖాతా కేవైసీ స్టేటస్ వంటి వివరాలను పరిశీలించారు. కానీ ఇప్పుడు ఆటోమేటెడ్ సిస్టమ్ లో క్లెయిమ్ సులువుగా జరిగేలా వాటిని పరిశీలించి ఆమోదిస్తారు.
ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు..
ఎమర్జెన్సీ సమయంలో ఈ ఫండ్ క్లెయిమ్ సెటిల్మెంట్ కోసం ఆటో మోడ్ 2020 ఏప్రిల్ లోనే ప్రారంభమైంది, కానీ, అనారోగ్య సమయాల్లో మాత్రమే డబ్బు ఉపసంహరించుకునే అవకాశం కల్పించింది. ఇప్పుడు దాని పరిధి పెరిగింది. అనారోగ్యం, విద్య, వివాహం, ఇల్లు కొనేందుకు కూడా ఈపీఎఫ్ నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. మరోవైపు ఇంట్లో సోదరి, సోదరుడి వివాహం ఉంటే అడ్వాన్స్ డబ్బులు కూడా విత్ డ్రా చేసుకోవచ్చు.
ఎంత డబ్బు తీసుకోవచ్చు?
ఈపీఎఫ్ ఖాతా నుంచి రూ. లక్ష వరకు అడ్వాన్స్ నిధులను ఉపసంహరించుకోవచ్చు, గతంలో ఈ పరిమితికి రూ. 50 వేలుగా ఉండేది. ఆటో సెటిల్మెంట్ మోడ్ కంప్యూటర్ ద్వారా అడ్వాన్స్ ఫండ్ విత్ డ్రా చేసుకోవచ్చు. దీనికి ఎవరి నుంచి అనుమతి అవసరం లేదు. మూడు రోజుల్లో మీ ఖాతాకు డబ్బులు వస్తాయి. దీనికి కేవైసీ, క్లెయిమ్ రిక్వెస్ట్ అర్హత, బ్యాంక్ అకౌంట్ వివరాలు అవసరం.
డబ్బు ఉపసంహరించుకునే ప్రక్రియ..
* ముందుగా యూఏఎన్, పాస్వర్డ్ ఉపయోగించి ఈపీఎఫ్ఓ పోర్టల్లోకి లాగిన్ అవ్వాలి.
* ఇప్పుడు మీరు ఆన్లైన్ సర్వీస్ లోకి వెళ్లి ‘క్లెయిమ్’ విభాగాన్ని ఎంచుకోవాలి. బ్యాంక్ ఖాతాను వెరిఫై చేయండి, ప్రొసీడ్ ఫర్ ఆన్ లైన్ క్లెయిమ్ మీద క్లిక్ చేయండి.
* కొత్త పేజీ ఓపెన్ కాగానే పీఎఫ్ అడ్వాన్స్ ఫారం 31 ఎంచుకోవాలి. ఇప్పుడు పీఎఫ్ ఖాతాను ఎంచుకోవాలి.
* ఇప్పుడు మీరు డబ్బు ఉపసంహరించుకోవడానికి కారణం, ఎంత డబ్బు ఉపసంహరించుకోవాలి మరియు చిరునామా నింపాలి. ఆ తర్వాత చెక్కు లేదా పాస్ బుక్ స్కాన్ కాపీని అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
* దీని తరువాత, మీరు సమ్మతిని ఇవ్వాలి మరియు దానిని ఆధార్ తో ధృవీకరించాలి. క్లెయిం ప్రాసెస్ చేయబడిన తరువాత, అది ఆమోదం కోసం యజమాని వద్దకు వెళుతుంది.
* ఆన్లైన్ సర్వీస్ కింద క్లెయిమ్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read More