Electric Cars : ఎలక్ట్రిక్ కారు నడుపుతున్నట్లయితే వేసవిలో బ్యాటరీని జాగ్రత్తగా చూసుకోండి.. లేకపోతే పెద్ద ప్రమాదం సంభవించవచ్చు. తరచుగా ప్రజలు కొన్ని తప్పులు చేస్తారు. దీని కారణంగా బ్యాటరీలో మంటలు చెలరేగే అవకాశం పెరుగుతుంది. కారు కాలి బూడిదవుతుంది. మీరు ఎలక్ట్రిక్ కారును ఉపయోగిస్తుంటే ఏ విషయాలను గుర్తుంచుకోవాలి? ఈ కథనంలో తెలుసుకుందాం.
ఎలక్ట్రిక్ కారులో ఉపయోగించే బ్యాటరీలు చాలా సున్నితంగా ఉంటాయి. భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో తీవ్రమైన వేడి ఉంటుంది. దీని కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలను ఛార్జ్ చేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. బ్యాటరీని ఎలా ఛార్జ్ చేస్తున్నారనే దానిపై ఎలక్ట్రిక్ వాహనం జీవితకాలం ఆధారపడి ఉంటుంది.
మొదటి తప్పు
కియా అధికారిక సైట్‌లో అందించిన సమాచారం ప్రకారం బ్యాటరీని ఎప్పుడూ 100 శాతం పూర్తిగా ఛార్జ్ చేయవద్దు. లిథియం-అయాన్ బ్యాటరీలు 30 శాతం-80 శాతం వరకు ఛార్జ్ చేసినప్పుడు ఉత్తమంగా పనిచేస్తాయి. నిరంతరం పూర్తి సామర్థ్యానికి ఛార్జ్ చేయడం బ్యాటరీపై ఒత్తిడిని కలిగిస్తుంది.
బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ 100 శాతం ఛార్జ్ అయినప్పుడు ఛార్జింగ్ ప్రక్రియను ఆటోమేటిక్ గా ఆపివేస్తుందని భావించినప్పటికీ, ఛార్జింగ్‌లో ఉంచడం వల్ల బ్యాటరీ జీవితంపై చెడు ప్రభావం చూపుతుంది. బ్యాటరీ క్రమంగా క్షీణించడం ప్రారంభమవుతుంది. వేసవిలో బ్యాటరీ ఈ విధంగా ఛార్జ్ చేస్తే, మంటలు చెలరేగే ప్రమాదం కూడా పెరుగుతుంది.
రెండవ తప్పు
ఎలక్ట్రిక్ కారును ఎండలో ఛార్జ్ చేయవద్దు. బ్యాటరీ ఛార్జ్ అవుతున్నప్పుడు ఉష్ణోగ్రత పెరుగుతుంది. కానీ మీరు డైరెక్ట్ ఎండలో ఛార్జ్ చేస్తే ఉష్ణోగ్రత మరింత పెరుగుతుంది. అధిక ఉష్ణోగ్రత కారణంగా, బ్యాటరీ జీవితం తగ్గుతుంది. సామర్థ్యం తగ్గుతుంది. ఇది రేంజ్ ని మాత్రమే కాకుండా, అధిక ఉష్ణోగ్రత కారణంగా మంటలకు కూడా దారితీస్తుంది. వేసవిలో డైరెక్ట్ గా ఎండకు బదులుగా నీడ ఉన్న ప్రదేశంలో కారును ఛార్జ్ చేయండి.